'SSMB28' పై వచ్చిన రూమర్లను క్లియర్ చేసిన థమన్

by సూర్య | Thu, Jan 26, 2023, 08:52 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. ఈ మూవీకి టెంపరరీగా 'SSMB28' అని టైటిల్ మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో మహేష్ సరసన సిజ్లింగ్ బ్యూటీ పూజా హెడ్గే జోడిగా నటిస్తుంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 11, 2023న విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వారాలు వినిపిస్తున్నాయి.

కొన్ని రోజులుగా ఈ సినిమాలో సంగీత దర్శకుడు ఎస్ థమన్ స్థానంలో ప్రముఖ సంగీతకారుడు అనిరుధ్‌ను తీసుకోవాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే థమన్ తన సోషల్ మీడియా పోస్ట్‌తో ఈ పుకార్లకు సమాధామిచ్చాడు. అతను SSMB28 సెట్‌ల నుండి ఒక స్నాప్‌ను షేర్ చేసి ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నట్లు ప్రకటించాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో రానున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
సుప్రీత క్రష్ ఎవరో తెలుసా..? Sat, May 04, 2024, 10:58 AM
ఇవాళ దాసరి నారాయణరావు జయంతి Sat, May 04, 2024, 10:16 AM
అందుకే ఓటు వేయలేదు: జ్యోతిక Sat, May 04, 2024, 10:10 AM
'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగల్ అవుట్ Fri, May 03, 2024, 08:55 PM
బుక్ మై షో ట్రేండింగ్ లో 'ఆ ఒక్కటి అడక్కు' Fri, May 03, 2024, 08:53 PM