మైఖేల్ నుండి గౌతమ్ మీనన్ రోల్ రివీల్ ..!!

by సూర్య | Wed, Jan 25, 2023, 05:54 PM

సందీప్ కిషన్, దివ్యాన్ష కౌశిక్ జంటగా నటిస్తున్న "మైఖేల్" చిత్రం నుండి కొన్ని రోజులుగా కీలకపాత్రల పరిచయం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనసూయా భరద్వాజ్, వరుణ్ సందేశ్, అయ్యప్ప శర్మ, వరలక్ష్మి శరత్ కుమార్, దివ్యాన్ష కౌశిక్ పరిచయ పోస్టర్లను విడుదల చేసిన మేకర్స్ తాజాగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ క్యారెక్టర్ ను ప్రేక్షకులకు పరిచయం చేసారు. ఈ సినిమాలో గౌతమ్ 'ది సేవేజ్ కింగ్' పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది.
రంజిత్ జయకొడి డైరెక్షన్లో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న మైఖేల్ తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. వచ్చే నెల 3న పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.

Latest News
 
ప్రముఖ తమిళ హాస్యనటుడు కన్నుమూత Sun, Feb 05, 2023, 11:18 PM
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ Sun, Feb 05, 2023, 09:58 PM
మస్కట్ కి 'ఏజెంట్' ప్రయాణం..ఎప్పుడంటే..? Sun, Feb 05, 2023, 07:29 PM
'గీత గోవిందం' డైరెక్టర్ తో రౌడీ హీరో న్యూ మూవీ ..? Sun, Feb 05, 2023, 07:24 PM
నెలరోజుల వ్యవధిలోనే .. యంగ్ హీరో రెండో సినిమా రిలీజ్..!! Sun, Feb 05, 2023, 07:16 PM