క్రేజీ బజ్ : మరోసారి గర్భం దాల్చిన RRR బ్యూటీ..!!

by సూర్య | Tue, Jan 24, 2023, 07:47 PM

రాజమౌళి రూపొందించిన గ్రాండ్ విజువల్ వండర్ "RRR"లో రామరాజుకు సరైన జోడిగా, సీతగా నటించి పాన్ ఇండియా ప్రేక్షకుల విశేష ప్రశంసలు అందుకుంది బాలీవుడ్ బ్యూటీ అలియా భట్. తన ప్రేమికుడు రణ్ బీర్ కపూర్ ని గతేడాది ఏప్రిల్ లో వివాహం చేసుకుని దాంపత్యజీవితంలోకి అడుగుపెట్టింది. ఆపై వెంటనే ప్రెగ్నన్సీ ఎనౌన్స్ చేసి నవంబర్ లో పండంటి పాపాయికి జన్మనిచ్చి అమ్మగా ప్రోమోట్ అయ్యింది. తన ముద్దుల పాపాయికి 'రాహా' అని పేరు పెట్టినట్టు అఫీషియల్ గా కూడా ఎనౌన్స్ చేసింది. డెలివరీ తదుపరి సోషల్ మీడియాలో మళ్ళీ తన హవాను మొదలుపెట్టింది.
సోషల్ మీడియాలో వినిపిస్తున్న తాజా బజ్ ప్రకారం, ఆలియా రెండోసారి గర్భం దాల్చిందని తెలుస్తుంది. ఈ కారణంగానే తన వద్దకు వస్తున్న భారీ ప్రాజెక్టులకు నో చెప్తుందట. ఈమధ్యన తరచుగా హాస్పిటల్స్ కి కూడా వెళ్లొస్తుందట. మరి, ఈ విషయంపై ఆలియా నుండి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.

Latest News
 
ప్రముఖ తమిళ హాస్యనటుడు కన్నుమూత Sun, Feb 05, 2023, 11:18 PM
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ Sun, Feb 05, 2023, 09:58 PM
మస్కట్ కి 'ఏజెంట్' ప్రయాణం..ఎప్పుడంటే..? Sun, Feb 05, 2023, 07:29 PM
'గీత గోవిందం' డైరెక్టర్ తో రౌడీ హీరో న్యూ మూవీ ..? Sun, Feb 05, 2023, 07:24 PM
నెలరోజుల వ్యవధిలోనే .. యంగ్ హీరో రెండో సినిమా రిలీజ్..!! Sun, Feb 05, 2023, 07:16 PM