వెల్ కమ్ టూ ముంబై సార్...బ్రహ్మనందంకు ఎయిర్ పోర్ట్ లో ఆహ్వానం

by సూర్య | Tue, Jan 24, 2023, 07:48 PM

వెల్ కమ్ టూ ముంబై సార్ అంటూ ఓ వ్యక్తి టాలీవుడ్ దిగ్గజ కమెడియన్ బ్రహ్మానందంకు స్వాగతం పలికారు. ఇదిలావుంటే బ్రహ్మనందం ముంబై ఎయిర్ పోర్టులో కెమెరాల కంటపడ్డారు. తెల్లటి దుస్తులను, నల్లటి కళ్లజోడును ధరించి ఆయన ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తుండగా పాపరాజ్జీలు ఆయనను తమ కెమెరాల్లో బంధించారు. సార్ మాస్క్ తీయండని ఒకరు కోరగా, ఆయన మాస్క్ ను తొలగించి, నవ్వులు చిందించారు. 


వెల్ కమ్ టూ ముంబై సార్ అంటూ మరొక వ్యక్తి బ్రహ్మీకి స్వాగతం పలికారు. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ఎన్నో చిత్రాలలో నటిస్తున్నారు. మైక్ టెస్టింగ్ 143, గజదొంగ, ఫీల్ మై లవ్, నిన్ను చూసిన క్షణాన, భవానీ ఐపీఎస్, వాల్ పోస్టర్ తో పాటు మరిన్ని చిత్రాలు ఆయన చేతిలో ఉన్నాయి.   

Latest News
 
సమంత 'శాకుంతలం' మూవీ నుండి లిరికల్ సింగ్ రిలీజ్ Wed, Feb 01, 2023, 09:16 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'యశోద' Wed, Feb 01, 2023, 09:00 PM
శర్వానంద్ కొత్త సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ Wed, Feb 01, 2023, 08:49 PM
శాకుంతలం థర్డ్ లిరికల్ వీడియో విడుదల ..!! Wed, Feb 01, 2023, 08:21 PM
మెగాస్టార్ 'గ్యాంగ్ లీడర్' రీ రిలీజ్ డేట్ ఫిక్స్..? Wed, Feb 01, 2023, 08:13 PM