సందీప్ కిషన్ "మైఖేల్" ట్రైలర్ కి వైల్డ్ రెస్పాన్స్..!!

by సూర్య | Tue, Jan 24, 2023, 07:01 PM

నిన్న విడుదలైన మైఖేల్ ట్రైలర్ ఆడియన్స్ దృష్టిని విశేషంగా ఆకర్షిస్తుంది. నిన్న ఉదయం పాన్ ఇండియా భాషల్లో విడుదలైన మైఖేల్ ట్రైలర్ ప్రస్తుతం 12 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ టాప్ #1 ట్రెండింగ్లో దూసుకుపోతుంది. వైల్డ్, రా అండ్ స్టైలిష్ మైఖేల్ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి వైల్డ్ రెస్పాన్స్ వస్తుంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయని తెలుస్తుంది. వచ్చే నెల 3వ తేదీనే మైఖేల్ పాన్ ఇండియా థియేటర్లలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ గా ఉన్నాడు. మరి, మైఖేల్ తన ట్రూ లవ్ కోసం చేసిన పోరాటం ప్రేక్షకులను మెప్పించి, బ్లాక్ బస్టర్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
రంజిత్ జేయకొడి డైరెక్షన్లో ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుంది. విజయ్ సేతుపతి విలన్గా నటిస్తున్నారు. సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
శాకుంతలం థర్డ్ లిరికల్ వీడియో విడుదల ..!! Wed, Feb 01, 2023, 08:21 PM
మెగాస్టార్ 'గ్యాంగ్ లీడర్' రీ రిలీజ్ డేట్ ఫిక్స్..? Wed, Feb 01, 2023, 08:13 PM
తరుణ్ భాస్కర్ 'కీడా కోలా'లో హీరో, హీరోయిన్లు ఉండరా..? Wed, Feb 01, 2023, 08:04 PM
రేపటి నుండే 'రైటర్ పద్మభూషణ్' పెయిడ్ ప్రీమియర్స్ Wed, Feb 01, 2023, 07:51 PM
'మట్టికుస్తీ' నుండి 'మిర మిరపకాయ్' వీడియో సాంగ్ ఔట్ Wed, Feb 01, 2023, 07:39 PM