![]() |
![]() |
by సూర్య | Tue, Jan 24, 2023, 07:10 PM
స్టార్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం "అమిగోస్". రాజేంద్ర రెడ్డి డైరెక్షన్లో విభిన్న యాక్షన్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో కన్నడ భామ అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. బ్రహ్మాజీ, సప్తగిరి కీరోల్స్ లో నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 10వ తేదీన విడుదల కావడానికి రెడీ అవుతుంది. రీసెంట్గా విడుదలైన టీజర్ సినిమాపై మంచి అంచనాలను నమోదు చేసింది.
ఈ నేపథ్యంలో అమిగోస్ మూవీ ఇంకా థియేటర్లకు రాకముందే నిర్మాతలకు లాభాలను ఆర్జించి పెడుతుందని తాజాగా ప్రచారం జరుగుతుంది. కళ్యాణ్ రామ్ గత చిత్రం బింబిసార బ్లాక్ బస్టర్ కావడం, అమిగోస్ టీజర్ సూపర్బ్ గా ఉండడంతో కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే అమిగోస్ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను దాటేసిందట. ఇక, విడుదల తరవాత అమిగోస్ సంపాదించే ప్రతి రూపాయి కూడా నిర్మాతలకు లాభమే అన్నమాట.
Latest News