రేపు థియేటర్స్ లో విడుదల కానున్న కొత్త టైటిల్స్

by సూర్య | Thu, Dec 01, 2022, 09:01 PM

హిట్2 :
'హిట్' మూవీతో ఘనవిజయం సాధించిన యువ దర్శకుడు శైలేష్ కోనేరు, 2021లో దాని సీక్వెల్‌ను ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని సమర్పిస్తున్న 'హిట్2' లో అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాలో అడివి శేష్ సరసన మీనాక్షి చౌదరి జంటగా నటిస్తుంది.


క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమా డిసెంబర్ 2, 2022న విడుదల కానుంది. రావు రమేష్, భాను చందర్, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి శ్రీనాథ్ మాగంటి, కోమలి ప్రసాద్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. జాన్ స్టీవర్ట్ ఎడూరి 'హిట్ : ది సెకండ్ కేసు' కి సంగీతం అందించారు.

మట్టి కుస్తి :
చెల్లా అయ్యావు దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విష్ణు విశాల్ 'మట్టి కుస్తి' సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ స్పోర్ట్స్ ఫ్యామిలీ డ్రామాలో విష్ణు విశాల్ కి లేడీ లవ్ గా ఐశ్వర్య లక్ష్మి నటిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 2, 2022న గ్రాండ్ విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ సినిమాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ తన హోమ్ బ్యానర్ అయిన ఆర్‌టి టీమ్‌వర్క్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

డీఎస్పీ :
పొన్‌రామ్ దర్శకత్వంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి 'డీఎస్పీ' సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. డిసెంబర్ 2న డీఎస్పీ సినిమా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి సరసన అనుకీర్తి వాస్ జోడిగా నటిస్తుంది. సన్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి డి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
అన్స్టాపబుల్ : వాడీవేడిగా పవర్ స్టార్మ్ సెకండ్ ఎపిసోడ్ ప్రోమో Sun, Feb 05, 2023, 06:54 PM
రైటర్ పద్మభూషణ్ రెండ్రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లు..!! Sun, Feb 05, 2023, 06:34 PM
NTR 32 పై సెన్సేషనల్ బజ్..!! Sun, Feb 05, 2023, 06:29 PM
మేనల్లుడి సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పిన సూపర్ స్టార్..!! Sun, Feb 05, 2023, 06:10 PM
డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ ఫిక్స్ చేసుకున్న ధనుష్ "సార్" Sun, Feb 05, 2023, 05:58 PM