'వీరసింహా రెడ్డి' మొదటి సింగిల్ విడుదలకి తేదీ లాక్

by సూర్య | Thu, Nov 24, 2022, 08:53 PM

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహ బాలకృష్ణ సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాకి 'వీర సింహారెడ్డి' అనే టైటిల్ ని లాక్ చేసారు. గతంలో విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, టీజర్‌కి అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది.

తాజా అప్డేట్ ప్రకారం, వీరసింహా రెడ్డి  ఫస్ట్ సింగిల్ నవంబర్ 25వ తేదీ ఉదయం 10:29 గంటలకు విడుదల కానుందని అధికారిక సమాచారం. ఈ విషయాని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ బాలకృష్ణ ట్రాక్టర్‌పై కూర్చున్న కూల్ పోస్టర్‌ను విడుదల చేసారు. ఈ యాక్షన్ డ్రామా సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ జోడిగా నటిస్తోంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించారు.

Latest News
 
పుత్రోత్సాహంతో పొంగిపోతున్న మెగాస్టార్.. ట్వీట్ వైరల్ !! Fri, Dec 02, 2022, 11:01 PM
USA లో అదరగొట్టేస్తున్న "హిట్ 2"..!! Fri, Dec 02, 2022, 10:32 PM
సమంత "యశోద" డిజిటల్ ఎంట్రీ పై లేటెస్ట్ బజ్ Fri, Dec 02, 2022, 10:26 PM
రేపు రాబోతున్న "గుర్తుందా శీతాకాలం" రిలీజ్ ట్రైలర్ ..!! Fri, Dec 02, 2022, 10:20 PM
'యశోద' 18 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Dec 02, 2022, 09:02 PM