రేపు విడుదల కాబోతున్న వరుణ్ ధావన్ "తోడేలు"

by సూర్య | Thu, Nov 24, 2022, 06:05 PM

రేపు శుక్రవారం ఇరు తెలుగు రాష్ట్రాల థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలలో బాలీవుడ్ డబ్బింగ్ మూవీ "తోడేలు" ఒకటి. వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటించిన "భేడియా" మూవీకి తెలుగు డబ్బింగే "తోడేలు". పోతే, రేపే తమిళంలో కూడా భేడియా రిలీజ్ కాబోతుంది.


అమర్ కౌశిక్ డైరెక్షన్లో ఇండియాస్ ఫస్ట్ ఎవర్ క్రియేచర్ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం తోడేలుగా మారిన ఒక సాధారణ వ్యక్తి జీవితంలో జరిగిన అనుకోని సంఘటనల సమాహారంగా తెరకెక్కింది. తెలుగులో ఈ చిత్రాన్ని అల్లుఅరవింద్ గారు సమర్పిస్తున్నారు.


ఇరు తెలుగు రాష్ట్రాలలో 250కి పైగా థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ చిత్రం రెండున్నర కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగబోతుంది.

Latest News
 
పవన్ కళ్యాణ్ - సుజీత్ సినిమాపై చరణ్ వైరల్ ట్వీట్ ..!! Mon, Dec 05, 2022, 09:18 AM
స్మాల్ స్క్రీన్ పై "లైగర్" పవర్ పంచ్... ఎప్పుడంటే..? Sun, Dec 04, 2022, 11:15 PM
పవన్ కళ్యాణ్ - సుజీత్ సినిమాపై ప్రభాస్ రియాక్షనిదే ..!! Sun, Dec 04, 2022, 11:04 PM
18 పేజెస్ : "టైమివ్వు పిల్ల" రిలీజ్ టైం ఫిక్స్..!! Sun, Dec 04, 2022, 10:45 PM
హిట్ 2 చూసిన బాలకృష్ణ ... ఏమన్నారంటే..? Sun, Dec 04, 2022, 09:54 PM