యానిమల్ : రణ్ బీర్ లీక్డ్ లుక్ తో.. అంచనాలు తారాస్థాయికి

by సూర్య | Thu, Nov 24, 2022, 11:35 AM

అర్జున్ రెడ్డి సినిమాతో ఉవ్వెత్తున ఎగిసిపడిన కెరటంలా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి దూసుకొచ్చిన యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమాను హిందీ కబీర్ సింగ్ పేరిట రీమేక్ చేసి అక్కడ కూడా స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు. చేసింది ఒకే ఒక్క సినిమానే అయినా ప్రేక్షకులలో ఎనలేని క్రేజ్ తెచ్చుకున్నారు సందీప్. ఈ క్రేజ్ తోనే పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసారు.


సందీప్ ప్రస్తుతం రణ్ బీర్ కపూర్ తో "యానిమల్" సినిమాను చేస్తున్నారు. ఇందులో రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తుంది. గతకొన్ని రోజుల నుండి ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా జరుగుతుంది.


లేటెస్ట్ గా ఈ సినిమా నుండి రణ్ బీర్ లుక్ ఒకటి బయటకు వచ్చింది. ఇందులో రక్తంతో తడిసిన బట్టలు, గుబురు గడ్డం, జులపాల జుట్టుతో రణ్ బీర్ లుక్ ఇంటెన్స్ అండ్ వెరీ రగ్డ్ గా ఉంది. లవర్ బాయ్ లా ఎంతో హ్యాండ్సమ్ గా ఉండే రణ్ బీర్ ఫుల్ యాక్షన్ మోడ్ లోకి మారిపోవడంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. 

Latest News
 
పవన్ కళ్యాణ్ - సుజీత్ సినిమాపై చరణ్ వైరల్ ట్వీట్ ..!! Mon, Dec 05, 2022, 09:18 AM
స్మాల్ స్క్రీన్ పై "లైగర్" పవర్ పంచ్... ఎప్పుడంటే..? Sun, Dec 04, 2022, 11:15 PM
పవన్ కళ్యాణ్ - సుజీత్ సినిమాపై ప్రభాస్ రియాక్షనిదే ..!! Sun, Dec 04, 2022, 11:04 PM
18 పేజెస్ : "టైమివ్వు పిల్ల" రిలీజ్ టైం ఫిక్స్..!! Sun, Dec 04, 2022, 10:45 PM
హిట్ 2 చూసిన బాలకృష్ణ ... ఏమన్నారంటే..? Sun, Dec 04, 2022, 09:54 PM