విడుదల తేదీని లాక్ చేసిన శివ కార్తికేయన్ 'ప్రిన్స్'

by సూర్య | Wed, Oct 05, 2022, 03:42 PM

తమిళ హీరో శివకార్తికేయన్ జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ తో డైరెక్ట్ తెలుగు మూవీ తీసుతున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాకి 'ప్రిన్స్' అని టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా ఇప్పుడు కామెడీ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో రానున్న ఈ సినిమా అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుందని మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు.

ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన ఉక్రెయిన్ బ్యూటీ మెరీనా ర్యాబోషప్కా జోడిగా కనిపించనుంది. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, సురేష్ బాబుతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తమిళ-తెలుగు మూవీకి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Latest News
 
'బలగం' 15 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Mon, Mar 20, 2023, 03:42 PM
'అమిగోస్' డే వైస్ కలెక్షన్స్ Mon, Mar 20, 2023, 03:40 PM
'వినరో భాగ్యము విష్ణు కథ' 27 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Mon, Mar 20, 2023, 03:38 PM
ఇటలీ, స్పెయిన్‌లో విడుదలకి సిద్దమవుతున్న 'కాంతారా' Mon, Mar 20, 2023, 03:24 PM
'సర్' 27 రోజుల AP/TS కలెక్షన్స్ Mon, Mar 20, 2023, 03:11 PM