శివ కార్తికేయన్ "ప్రిన్స్" రిలీజ్ డేట్ ఫిక్స్ ..!!

by సూర్య | Tue, Oct 04, 2022, 05:45 PM

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, కొత్తమ్మాయి మారియా ర్యాబోషప్క జంటగా, తెలుగు డైరెక్టర్ అనుదీప్ కేవీ తెరకెక్కిస్తున్న చిత్రం "ప్రిన్స్".ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పార్ట్ పూర్తయ్యింది. ఇప్పటివరకు విడుదలైన లిరికల్ సాంగ్స్ ప్రేక్షకులకు నచ్చడంతో వారిలో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. పోతే, ఇందులో హీరో శివ కార్తికేయన్ స్కూల్ టీచర్ లా నటించబోతున్నట్టు తెలుస్తుంది.


దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీన తెలుగు, తమిళ భాషలలో థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుందని కొంచెంసేపటి క్రితమే మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ సినిమాను సునీల్ నారంగ్, సురేష్ బాబు, పుస్కూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. తమన్ సంగీతం అందించారు.

Latest News
 
ఆహాలో అన్ స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్ రికార్డ్ ..!! Tue, Dec 06, 2022, 09:11 AM
యూట్యూబులో 1M లైక్స్ తో "థీ తలపతి" సాంగ్..!! Tue, Dec 06, 2022, 08:46 AM
రూత్ లెస్ కాప్ "అర్జున్ సర్కార్"... నాని ట్విట్టర్ పోస్ట్ వైరల్ ..!! Tue, Dec 06, 2022, 08:32 AM
ప్రముఖ సంస్థ చేతికి అజిత్ "తునివు" తెలుగు హక్కులు..!! Tue, Dec 06, 2022, 08:15 AM
"వారసుడు" కి అన్నయ్యగా... రవితేజ విలన్ ..!! Tue, Dec 06, 2022, 08:05 AM