ప్రభాస్ వల్ల ...వాయిదా పడిన "హనుమాన్" టీజర్ - డైరెక్టర్ వైరల్ ట్వీట్

by సూర్య | Thu, Sep 29, 2022, 05:17 PM

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం "హనుమాన్". ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకుడు కాగా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుంది.దసరా కానుకగా హనుమాన్ టీజర్ రిలీజ్ కావాల్సి ఉంది. ఈ మేరకు అన్ని పనులను మేకర్స్ పూర్తి చేసారు. ఇంకేముంది ఎనౌన్స్మెంట్ ఇద్దామనుకునేలోపు ... డార్లింగ్ ప్రభాస్ వచ్చి అంతా చెడగొట్టేసాడు.అదేంటి అనుకుంటున్నారా.... రాముడిగా ప్రభాస్ రాక అదేనండి "ఆదిపురుష్" టీజర్ అండ్ ఫస్ట్ లుక్ దసరా కానుకగా విడుదల కాబోతున్నాయి కదా... దీంతో ప్రశాంత్ వర్మ మూడు రాముడు వచ్చి వెళ్లిన తరవాత హనుమంతుడిని ప్రేక్షకులకు పరిచయం చేద్దామని హనుమాన్ టీజర్ రిలీజ్ ను వాయిదా వేసాడట. ఈ మేరకు ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Latest News
 
'వాతి' 27 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Mon, Mar 20, 2023, 02:40 PM
'బలగం' 15 రోజుల డే వైస్ కలెక్షన్స్ Mon, Mar 20, 2023, 02:31 PM
'కబ్జా' 2 రోజుల AP/TS కలెక్షన్స్ Mon, Mar 20, 2023, 02:25 PM
భువనవిజయమ్ ఇంట్రెస్టింగ్ టీజర్ కి 1M వ్యూస్ Mon, Mar 20, 2023, 02:18 PM
'వినరో భాగ్యము విష్ణు కథ' 26 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Mon, Mar 20, 2023, 02:18 PM