'టైగర్ నాగేశ్వరరావు' నుండి రేణు దేశాయ్ ఫస్ట్ లుక్ ఔట్

by సూర్య | Thu, Sep 29, 2022, 04:37 PM

వంశీ డైరెక్షన్లో మాస్ రాజా రవితేజ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ "టైగర్ నాగేశ్వరరావు". ఇందులో నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇటీవలే ఈ మూవీ నుండి బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్ ఫస్ట్ లుక్ రివీల్ అవ్వగా, లేటెస్ట్ గా ఈ సినిమాలో మరొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ పోషిస్తున్న రేణు దేశాయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ పోస్టర్ లో రేణు తెల్లచీర కట్టుకుని, కళ్ళజోడు పెట్టుకుని ఎటువైపో చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నారు. అన్నట్టు రేణు పోషిస్తున్న పాత్ర పేరు హేమలత లవణం. ఈ విషయాన్ని రేణు రీసెంట్గానే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.GV ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు.

Latest News
 
'యానిమల్' మూవీకి ఉత్తమ దర్శకుడు అవార్డును గెలుచుకున్నా సందీప్ రెడ్డి వంగా Tue, Feb 20, 2024, 11:19 PM
హనుమాన్ నుంచి 'రఘునందన' సాంగ్ రిలీజ్ Tue, Feb 20, 2024, 09:45 PM
నెట్‌ఫ్లిక్స్‌లో 'యానిమల్' మ్యానియా Tue, Feb 20, 2024, 09:20 PM
రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమా లాంచ్ ఎప్పుడంటే....! Tue, Feb 20, 2024, 09:17 PM
'ట్రూ లవర్' డిజిటల్ అరంగేట్రం అప్పుడేనా? Tue, Feb 20, 2024, 09:08 PM