by సూర్య | Thu, Sep 29, 2022, 03:55 PM
బాలయ్య బాబు అప్ కమింగ్ మూవీ "NBK 107" ప్రస్తుత షెడ్యూల్ టర్కీ లో జరుగుతున్న విషయం తెలిసిందే కదా. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ షెడ్యూల్ పూర్తైపోయి, NBK 107 బృందం హైదరాబాద్ కి తిరుగు ప్రయాణం అవుతున్నారంట. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బాలయ్య, గోపీచంద్ మలినేనిల ఫ్యామిలీ ఫోటో ఈ విషయాన్ని తెలపకనే తెలుపుతుంది. ఈ ఫొటోలో నందమూరి మోక్షజ్ఞ కూడా ఉండడం విశేషం.
బాలకృష్ణ, గోపీచంద్ కాంబోలో రాబోతున్న తొలి సినిమా ఇదే. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.
లేటెస్ట్ బజ్ ప్రకారం, దసరా పండుగను పురస్కరించుకుని NBK 107 టైటిల్ రివీల్ కావొచ్చని వార్తలు వస్తున్నాయి. నందమూరి అభిమానులు కూడా ఈ మూవీ టైటిల్ కోసం కుతూహలంగా ఎదురుచూస్తున్నారు.