ఈ తేదీన విడుదల కానున్న 'స్వాతిముత్యం' ట్రైలర్‌

by సూర్య | Sat, Sep 24, 2022, 08:17 PM

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు మరియు నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ గణేష్ టాలీవుడ్ లోకి హీరోగా అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'స్వాతిముత్యం' తో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. తాజా అప్డేట్ ప్రకారం, స్వాతిముత్యం ట్రైలర్ సెప్టెంబర్ 26న ఉదయం 11:07 గంటలకు విడుదల కానుంది అని ఈరోజు మూవీ మేకర్స్ ట్విట్టర్‌లో కొత్త పోస్టర్‌ను విడుదల చేసి ప్రకటించారు. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్సె ని మూవీ మేకర్స్ సంక్రాంతికి విడుదల చేయగా ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది.


ఈ చిత్రంలో బెల్లంకొండ గణేష్ సరసన వర్ష బొల్లమ్మ కథానాయికగా కనిపించనుంది. స్వాతిముత్యం సినిమా 2022 దసరా సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, రావు రమేష్, సుబ్బరాజు, హర్షవర్ధన్, గోపరాజు రమణ, ప్రగతి తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM