అఫీషియల్ : "ఘోస్ట్" ఈవెంట్లో బంగార్రాజు, ఏజెంట్

by సూర్య | Fri, Sep 23, 2022, 06:11 PM

అక్టోబర్ ఐదవ తేదీన తెలుగు ప్రేక్షకులకు 'ఘోస్ట్' గా పరిచయం కాబోతున్నారు అక్కినేని నాగార్జున. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 25వ తేదీన కర్నూల్ లో జరగబోతున్న ఘోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అక్కినేని హీరోలు నాగచైతన్య, అఖిల్ ముఖ్య అతిధులుగా హాజరు కాబోతున్నారు. ఈ విషయం ముందు నుండి ప్రచారంలో ఉన్నా, కొంచెంసేపటి క్రితమే మేకర్స్ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు.
ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో పర్ఫెక్ట్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీలో సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి అంచనాలను నమోదు చేసింది.  

Latest News
 
36 గంటల పాటు అభిమాని శ్రమ...10 వేల పదాలతో దళపతి విజయ్‌పై కవిత Mon, Apr 22, 2024, 10:51 PM
ఈ సారి ‘కూలీ'గా రాబోతున్న రజనీకాంత్‌ Mon, Apr 22, 2024, 09:10 PM
20 భాషలలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న 'కంగువ' Mon, Apr 22, 2024, 08:45 PM
'మిరాయి' చిత్రం గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Apr 22, 2024, 08:43 PM
'మైదాన్' 10 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే....! Mon, Apr 22, 2024, 08:39 PM