నెటిజన్ ట్వీట్ కు... సాయిధరమ్ మెగా స్పందన

by సూర్య | Fri, Sep 23, 2022, 04:06 PM

యాక్సిడెంట్ తదుపరి ఈ మధ్యనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఒకేసారి రెండు మూడు ప్రాజెక్టులను ప్రకటించి, వాటి షూటింగులతో బిజీగా ఉన్నారు.
ఆయన హీరోగా నటిస్తున్న ఒక మూవీ షూటింగ్ ఈ మధ్యే హైదరాబాద్ లోని HMT అర్బన్ ఫారెస్ట్రీ లో జరిగింది. షూటింగ్ జరుగుతున్న క్రమంలో చిత్రబృందం అడవిలో చాలా చెత్తను డంప్ చేసింది. ఈ విషయాన్ని ఒక నెటిజన్ సాయిధరమ్ దృష్టికి తీసుకొచ్చారు. అడవిలో ఉండే వివిధ రకాల జంతువులకు ఆ చెత్త హానికరం... దయచేసి ఆ చెత్తను క్లీన్ చేయించండి... అంటూ చిత్రబృందం వేసిన చెత్త ఫోటోలను సాయిధరమ్ కు ఒక నెటిజన్ పంపించాడు.
నెటిజన్ ట్వీట్ కు మెగా మేనల్లుడు వెంటనే స్పందించి, ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, అక్కడి చెత్తను తక్షణమే క్లీన్ చేయిస్తానని మాట ఇస్తూ రీ ట్వీట్ చేసారు. చెప్పినట్టే చేసారు కూడా. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

Latest News
 
ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న‘అబ్రహాం ఓజ్లర్‌’ మూవీ Fri, Mar 01, 2024, 11:35 PM
UK మరియు ఐర్లాండ్ లో 'బ్రహ్మయుగం' 14 రోజులలో ఎంత వసూళ్లు చేసినదంటే...! Fri, Mar 01, 2024, 09:15 PM
'UI' ఆడియో రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ మ్యూజిక్ లేబెల్ Fri, Mar 01, 2024, 09:13 PM
ఆఫీసియల్ : 'హనుమాన్' OTT ఎంట్రీకి తేదీ ఖరారు Fri, Mar 01, 2024, 09:11 PM
డిజిటల్ పార్టనర్ ని లాక్ చేసిన 'ప్రేమలు' Fri, Mar 01, 2024, 09:10 PM