హిందీ 'విక్రమ్ వేద' ట్రైలర్ కు డేట్ ఫిక్స్ ..?

by సూర్య | Sat, Aug 06, 2022, 06:47 PM

తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'విక్రమ్ వేద' హిందీలో అదే పేరుతో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. హిందీలో 'వేద'గా హృతిక్ రోషన్, 'విక్రమ్'గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ గా హృతిక్ రోషన్, పవర్ ఫుల్ పోలీసాఫిసర్ గా సైఫ్ అలీఖాన్ ఫస్ట్ లుక్స్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. 
లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ మూవీ టీజర్ ను ఆగస్టు 11వ తేదీన థియేటర్లలో విడుదల చెయ్యబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఆ రోజున విడుదల కాబోతున్న లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్ మూవీల రన్నింగ్ టైం లో విక్రమ్ వేద టీజర్ ప్రదర్శింపబడుతుందని టాక్. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందట. తమిళంలో ఈ సినిమాకి దర్శకత్వం వహించిన పుష్కర్, గాయత్రీ లే హిందీ లో కూడా దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. రాధికా  ఆప్టే,రోహిత్ సరఫ్,షరీబ్ హష్మీ మరియు యోగితా బిహాని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. భూషణ్ కుమార్ మరియు  రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 30, 2022 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM