షాకింగ్ : "సీతారామం"లో పూజాహెగ్డేనా ? 

by సూర్య | Sat, Aug 06, 2022, 11:39 AM

నిన్న విడుదలై తొలిషోతోనే హిట్ టాక్ అందుకున్న ఎపిక్ లవ్ స్టోరీ "సీతారామం" లో పూజా హెగ్డే ఉందా అని కొంతమంది ఆశ్చర్యపోతున్నారు. విషయమేంటంటే, నిజానికి సీతారామం కథ మొత్తం 'సీత ' పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ముందుగా ఆ పాత్రకు డస్కీ సైరన్ పూజాహెగ్డే ని ఎంచుకున్నారట. ఈ సినిమా కోసం పూజా కొన్ని నెలల కాల్షీట్లను సైతం కేటాయించిందంట. కానీ, సీన్ కట్ చేస్తే, సీతామహాలక్ష్మీ పాత్రలో బాలీవుడ్ బుల్లితెర నటి మృణాల్ ఠాకూర్ వచ్చి చేరింది. కారణం... షూట్ స్టార్ట్ చేద్దామనుకునే సమయంలో పూజకు కోవిడ్ సోకిందంట. షూటింగ్ వాయిదా వేసి అనవసరపు ఖర్చు చేసేందుకు ఇష్టపడని నిర్మాతలు పూజా ప్లేస్ లో మరొక హీరోయిన్ కోసం వేటాడి ఆఖరికి మృణాల్ ఐతే, కొత్తగా ఉంటుందని ఆమెను ఫైనల్ చేసారంట.
ప్రస్తుతమైతే, సీతారామంకు వస్తున్న స్పందన అద్భుతం. సీతా మహాలక్ష్మిగా ఉత్తరాది అమ్మాయి మృణాల్ నటించినా, అచ్చు తెలుగమ్మాయినే తలపించి, టాలీవుడ్ ఆడియన్స్ గుండెల్లో స్థానం సంపాదించుకుంది. ఏమైనా, కరోనా పూజకు తీరని అన్యాయమే చేసిందబ్బ.  

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కానున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ Wed, Aug 10, 2022, 10:51 PM
'బుజ్జీ ఇలారా' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Aug 10, 2022, 10:26 PM
సినీ నటి టబుకు తీవ్రగాయాలు Wed, Aug 10, 2022, 10:06 PM
షూటింగ్‌లో గాయపడిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి Wed, Aug 10, 2022, 09:22 PM
వరంగల్ లో "లైగర్" ప్రమోషన్స్ ...ఎప్పుడంటే? Wed, Aug 10, 2022, 07:00 PM