థాంక్యూ ఎఫెక్ట్ : రూటు మారుస్తున్న నాగచైతన్య ... !!

by సూర్య | Sat, Aug 06, 2022, 12:01 PM

లవ్ స్టోరీ, థాంక్యూ వంటి రెండు బ్యాక్ టు బ్యాక్ లవ్ స్టోరీలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అక్కినేని హీరో నాగచైతన్య, ఒక సినిమాతో డీసెంట్ హిట్ అందుకుని, మరొక సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ను అందుకున్నాడు. ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు కూడా లవ్ స్టోరీల పట్ల కాకుండా యాక్షన్ అండ్ మాస్ సినిమాలను ఎక్కువగా ఆదరిస్తుండడంతో చైతు తన రూట్ ను మార్చబోతున్నాడని తెలుస్తుంది.  
ఇప్పటికే కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో చైతు ఒక యాక్షన్ సినిమాకు సైన్ చెయ్యగా, లేటెస్ట్ గా డీజే టిల్లు ఫేమ్ విమల్ కృష్ణ చెప్పిన ఒక కథను కూడా చైతు ఓకే చేసినట్టు తెలుస్తుంది. ఈ విషయంపై ఇంకా అఫీషియల్ క్లారిటీ రావలసి ఉంది. డీజే టిల్లు ప్రేక్షకులను ఎంతలా అలరించిందో, ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విమల్ చెప్పిన స్టోరీ కూడా చైతు ఇప్పటివరకు ట్రై చెయ్యని కామెడీ అండ్ ఫన్ జోనర్ లో ఉండడంతో పరశురామ్ కన్నా ముందుగానే విమల్ తో సినిమా చెయ్యాలని చైతు డిసైడ్ అయ్యాడంట. పరశురామ్ ఇంకా చైతూకు కధనే వినిపించలేదు కాబట్టి చైతు - పరశురామ్ కాంబోలో మూవీ రావాలంటే ఇంకా చాలా టైం పట్టేటట్టే ఉంది.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కానున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ Wed, Aug 10, 2022, 10:51 PM
'బుజ్జీ ఇలారా' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Aug 10, 2022, 10:26 PM
సినీ నటి టబుకు తీవ్రగాయాలు Wed, Aug 10, 2022, 10:06 PM
షూటింగ్‌లో గాయపడిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి Wed, Aug 10, 2022, 09:22 PM
వరంగల్ లో "లైగర్" ప్రమోషన్స్ ...ఎప్పుడంటే? Wed, Aug 10, 2022, 07:00 PM