"లాల్ సింగ్ చడ్డా" నుండి మెలోడీ సాంగ్ రిలీజ్

by సూర్య | Fri, Aug 05, 2022, 01:51 PM

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్, నాగ చైతన్య కీలకపాత్రలు పోషించిన చిత్రం "లాల్ సింగ్ చడ్డా". అద్వైత్ చందన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 11వ తేదీన విడుదల కాబోతుంది. ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. పోతే..., ఈ చిత్రం హాలీవుడ్ క్లాసిక్ మూవీ ఫారెస్ట్ గంప్ (1994) కి ఇండియన్ రీమేక్.
లేటెస్ట్ గా ఈ మూవీ తెలుగు వెర్షన్ కి సంబంధించి "నిన్నే మొదటిసారి చూసా" అనే సూథింగ్ మెలోడీ వీడియో సాంగ్ ను మేకర్స్ కొంచెంసేపటి క్రితమే విడుదల చేసారు. హీరోహీరోయిన్ల బాల్యం, వారి మధ్య చిగురించిన స్నేహం ఈ పాటలో చిత్రీకరింపబడింది. ఈ పాటను ప్రీతమ్ స్వరపరచగా, భాస్కరభట్ల సాహిత్యమందించారు. సోనూ నిగమ్, రోమి కలిసి ఆలపించారు.

Latest News
 
ఆయనతో నటించే అవకాశం రావడం నా అదృష్టం : కాజల్ Tue, May 21, 2024, 11:34 AM
రావణుడి పాత్ర కోసం రియల్ గోల్డ్? Tue, May 21, 2024, 10:56 AM
'గం గం గణేశ' ట్రైలర్ అవుట్ Mon, May 20, 2024, 06:33 PM
50 రోజులు థియేటర్ రన్ పూర్తి చేసుకున్న 'క్రూ' Mon, May 20, 2024, 06:30 PM
రత్నం నుండి 'ఎటువైపో' వీడియో సాంగ్ అవుట్ Mon, May 20, 2024, 06:28 PM