హీరో ఎంట్రీ సీన్ కోసం పది కోట్లా...? దిల్ రాజు పర్సును ఖాళీ చేస్తున్న శంకర్

by సూర్య | Wed, Jul 06, 2022, 05:14 PM

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సోలో హీరోగా, కెరీర్లోనే ఎక్కువ బడ్జెట్ తో నిర్మితమవుతున్న సినిమా "RC15". కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ నటిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి దిల్ రాజు తను నిర్మించే ప్రతి సినిమా ఖర్చుల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటూ, అనుకున్న సమయానికి, అనుకున్న బడ్జెట్ లో సినిమా షూటింగ్ పూర్తి చేస్తారని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. కానీ, RC 15 విషయంలో దిల్ రాజు తన పద్ధతిని పక్కన పెట్టి, బడ్జెట్ విషయంలో డైరెక్టర్ శంకర్ కు పూర్తి హక్కులను ఇచ్చారట. అసలే ప్రతి సీన్ ను రిచ్ గా చిత్రీకరించాలని పాకులాడే శంకర్, దిల్ రాజు ఇచ్చిన ఫైనాన్సియల్ ఫ్రీడమ్ తో, చరణ్ ఎంట్రీ సీన్ ను భారీ ఎత్తున ప్లాన్ చేసాడట. డ్యూయల్ రోల్ లో మూడు విభిన్న పాత్రలను పోషించబోతున్న చెర్రీ ఎంట్రీ సీన్ కు సంబంధించిన షూటింగ్ ను పది కోట్ల విలువైన భారీ సెట్ లో ప్లాన్ చేశారట శంకర్. ఈ ఎంట్రీ సీన్ చెర్రీ కెరీర్లో ది బెస్ట్ అండ్ కాస్ట్లీ సీన్ గా ఉండబోతుందని టాక్. భారీతనానికి పెద్దపీట వేసే శంకర్ దిల్ రాజుకు ఈ సినిమాతో ఎంతటి భారీ విజయాన్ని అందిస్తాడో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీకాంత్, అంజలి, సునీల్ కీలకపాత్రలను పోషిస్తున్నారు.

Latest News
 
విడుదల తేదీ లాక్ చేసిన 'హరోమ్‌హర' Mon, Apr 29, 2024, 03:59 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌ రిలీజ్ Mon, Apr 29, 2024, 03:58 PM
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ అవుట్ Mon, Apr 29, 2024, 03:54 PM
ప్రియదర్శి తదుపరి చిత్రం కోసం జతకట్టిన రానా దగ్గుబాటి మరియు జాన్వీ నారంగ్ Mon, Apr 29, 2024, 03:37 PM
త్వరలో రివీల్ కానున్న 'గం గం గణేశ' విడుదల తేదీ Mon, Apr 29, 2024, 03:26 PM