మ్యూజికల్ అప్డేట్ తో ప్రమోషన్స్ షురూ చేసిన "లైగర్"

by సూర్య | Wed, Jul 06, 2022, 05:25 PM

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం "లైగర్". ఇందులో బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను ప్రఖ్యాత బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో కలిసి పూరి జగన్నాధ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. నిజానికి ఈ మూవీ షూటింగును పూరి గతేడాది నవంబర్ లోనే ఫినిష్ చేసారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల నిమిత్తం తొమ్మిది నెలల సుదీర్ఘ సమయాన్ని తీసుకున్న లైగర్ టీం తాజాగా ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ మేరకు కొంచెంసేపటి క్రితమే మేకర్స్ అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేసారు. "అక్డి పక్డి" అనే సాగే పాటను పూర్తిగా జూలై 11వ తేదీన లిరికల్ వెర్షన్ లో, జూలై 8వ తేదీన సాంగ్ టీజర్ ను రిలీజ్ చెయ్యబోతున్నట్టు ఎనౌన్స్ చేసారు. పోస్టర్ ను బట్టి ఈ పాట మంచి మాస్ మసాలా సాంగ్ లా ఉండనుందని తెలుస్తుంది. పాన్ ఇండియా భాషల్లో ఆగస్టు 25న విడుదల కాబోతున్న ఈ చిత్రం పట్ల అటు నార్త్ లో, ఇటు సౌత్ లో మంచి అంచనాలు ఉన్నాయి. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఈ సినిమాతో భారతీయ సినీ రంగ ప్రవేశం చెయ్యడం విశేషం.

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM