యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ లో రామ్ "ది వారియర్" ట్రైలర్

by సూర్య | Tue, Jul 05, 2022, 02:02 PM

యంగ్ హీరోహీరోయిన్లు రామ్ పోతినేని, కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం "ది వారియర్". కోలీవుడ్ డైరెక్టర్ ఎన్. లింగుసామి డైరెక్షన్లో ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్  పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. సత్య IPS పాత్రలో రామ్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో అక్షర గౌడ మరో హీరోయిన్ గా నటిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా జూలై 14వ తేదీన విడుదల కాబోతున్న ఈ మూవీ ట్రైలర్ ఇటీవలే విడుదల కాగా, ప్రేక్షకుల నుండి ఈ మాస్సివ్ ట్రైలర్ కు విశేష స్పందన వచ్చింది. తెలుగు, తమిళ భాషలలో కలుపుకుని మొత్తం 16మిలియన్ల వీక్షణలతో యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM