డీజేటిల్లు 2 హీరోయిన్ మారింది ?

by సూర్య | Tue, Jul 05, 2022, 10:52 AM

చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని నమోదు చేసింది. 'డీజే టిల్లు'. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కించిన చిత్రమిది. హీరో క్యారెక్టరైజేషన్, తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ.. ఇవే ఈ సినిమా సక్సెస్ కి ప్రధాన కారణాలు. ఈ క్యారెక్టర్ మరిన్ని అద్భుతాలు సృష్టిస్తుందని 'డీజే టిల్లు 2' కి ప్లాన్ చేశారు. ఇటీవలే నిర్మాత నాగ వంశీ సీక్వెల్ ను అనౌన్స్ చేశారు. త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే సీక్వెల్ లో కీలక మార్పులు చేశారని సమాచారం. డీజే టిల్లులో టిల్లుతో పాటు... రాధిక క్యారెక్టర్ కూడా చాలా కీలకం. ఈ పాత్రలో నేహా శెట్టి కనిపించింది.అయితే డీజే టిల్లు 2లో నేహా శెట్టి హీరోయిన్ కాదట. ఆమె స్థానంలో మరో గామరస్ హీరోయిన్ కనిపించనుందట. నేహా శెట్టిని గెస్ట్ రోల్ కి పరిమితం చేయనున్నారని తెలిసింది. మరో ఒకట్రెండు కొత్త పాత్రలు కూడా సీక్వెల్ కోసం క్రియేట్ చేశారని చెబుతున్నారు.

Latest News
 
రౌడీ హీరో హాట్ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరో తెలుసా? Sat, Aug 13, 2022, 08:33 PM
"లైగర్" తో విజయ్ ఖాతాలో క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్టులు? Sat, Aug 13, 2022, 08:21 PM
ముంబైలో "లైగర్" స్పెషల్ ప్రీమియర్ ..? Sat, Aug 13, 2022, 08:05 PM
కార్తికేయ 2 సక్సెస్ సెలెబ్రేషన్స్ Sat, Aug 13, 2022, 07:46 PM
వెంకీమామ టాలీవుడ్ ఎంట్రీకి 36 ఏళ్ళు Sat, Aug 13, 2022, 07:38 PM