నేటి నుండి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న "సామ్రాట్ పృథ్విరాజ్"

by సూర్య | Fri, Jul 01, 2022, 10:31 AM

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ తొలిసారి నటించిన చారిత్రక నేపధ్య చిత్రం పృథ్విరాజ్. చంద్రప్రకాష్ ద్వివేది డైరెక్షన్లో సామ్రాట్ పృథ్విరాజ్ చౌహన్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ మూవీతో 2017 మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ హీరోయిన్ గా సినీరంగ ప్రవేశం చేసింది. ఈ సినిమాను ప్రముఖ యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ భారీ బడ్జెట్టుతో నిర్మించింది. భారీ అంచనాల నడుమ ఈమధ్యనే విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అనుకున్న రీతిలో ఆకట్టుకోలేదు. పేలవ ప్రదర్శన తో వసూళ్లను రాబట్టడం లో ఘోరంగా విఫలం అయింది. ప్రేక్షకులు లేక కొన్నిచోట్ల పృథ్విరాజ్ ప్రదర్శనలను నిలిపివేశారు.
నిర్మాతలు తమ నష్టాన్ని పూడ్చుకోవడానికి అనుకున్న సమయానికంటే, కూసింత ముందుగానే పృథ్విరాజ్ మూవీని డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధం చేసారు. ఈ రోజు నుండి పృథ్విరాజ్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. అనుకున్న సమయానికంటే, ముందుగా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైతే, ఆయా ఓటిటి సంస్థలు నిర్మాతలకు భారీ మొత్తాన్ని ముట్టజెప్తాయి. రాధేశ్యామ్, ఆచార్య సినిమాలలో ఇలాంటి ప్లాన్ ను మనం ఆల్రెడీ చూసాం కూడా.

Latest News
 
కమెడియన్ ప్రవీణ్ ఇంట తీవ్ర విషాదం Wed, Aug 17, 2022, 11:08 PM
'గాడ్‌ఫాదర్‌' మూవీ అప్డేట్ Wed, Aug 17, 2022, 10:53 PM
మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ Wed, Aug 17, 2022, 10:38 PM
రేపు థియేటర్లో సందడి చేయనున్న ధనుష్ 'తిరు' మూవీ Wed, Aug 17, 2022, 09:26 PM
'దొంగలున్నారు జాగ్రత్త' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Aug 17, 2022, 09:11 PM