చేతినిండా సినిమాలున్నా ... సంతృప్తి చెందని "పెళ్లి సందడి" బ్యూటీ

by సూర్య | Fri, Jul 01, 2022, 11:00 AM

చేసింది ఒకే ఒక్క సినిమా..కానీ స్టార్ హీరోయిన్ కి ఉండేంత క్రేజ్, ఫాలోయింగ్. పైపెచ్చు కోటికి తగ్గని రెమ్యునరేషన్. టాలీవుడ్ లో యంగ్ బ్యూటీ శ్రీలీల స్టార్డం అన్నమాట ఇదంతా. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రం కమర్షియల్గా ఫర్వాలేదనిపించినప్పటికీ శ్రీలీలకు మాత్రం సూపర్ ఫాలోయింగ్ వచ్చింది. దీంతో ఆమె వరస సినిమాల్లో లీడ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. నితిన్ 32వ సినిమాలో, రవితేజ "ధమాఖా", అనగనగా ఒక ధీరుడు, వైష్ణవ్ తేజ్ నాల్గవ సినిమాలో, ఇంకా దుబారి అనే కన్నడ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.
చేతిలో ఐదు సినిమాలు, చర్చల్లో ఇంకొన్ని సినిమాలున్నాయి. కానీ, శ్రీలీల మాత్రం ఇంకా ఏదో కావాలని తన మేనేజర్లను ఇబ్బంది పెడుతుందట. ఎన్టీఆర్, రాంచరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలిప్పించమని మేనేజర్లను విసిగిస్తోందట. ఈ క్రమంలో తనకు సన్నిహితుడైన ఒక యంగ్ ప్రొడ్యూసర్ నిర్మించే ఒక భారీ ప్రాజెక్ట్ లో స్టార్ హీరో పక్కన లీడ్ హీరోయిన్ గా నటించే అవకాశం తనకివ్వమని అతన్ని రిక్వెస్ట్ చేస్తుందట. మొత్తానికి శ్రీలీల తన కెరీర్ ను బాగానే ప్లాన్ చేసుకుంటుంది.   

Latest News
 
కమెడియన్ ప్రవీణ్ ఇంట తీవ్ర విషాదం Wed, Aug 17, 2022, 11:08 PM
'గాడ్‌ఫాదర్‌' మూవీ అప్డేట్ Wed, Aug 17, 2022, 10:53 PM
మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ Wed, Aug 17, 2022, 10:38 PM
రేపు థియేటర్లో సందడి చేయనున్న ధనుష్ 'తిరు' మూవీ Wed, Aug 17, 2022, 09:26 PM
'దొంగలున్నారు జాగ్రత్త' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Aug 17, 2022, 09:11 PM