వైరల్ పిక్: ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు సీనియర్ సూపర్ హీరోలు

by సూర్య | Wed, Jun 22, 2022, 02:38 PM

టాలీవుడ్ సీనియర్ సూపర్ హీరోలు చిరంజీవి, వెంకటేష్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్... ఈ ముగ్గురిని ఒకే ఫ్రేమ్ లో చూస్తే ఇంకేమన్నా ఉందా? ..  ఫ్యాన్స్ కు పండగే పండగ. ఐతే, ఈ ముగ్గురు కలుసుకున్నది సినిమా కోసం మాత్రం కాదు. ఈ ముగ్గురికి కామన్ ఫ్రెండ్ ఐన జేసి పవన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఒక పార్టీలో వీళ్ళందరూ కలవడం జరిగింది. కభీ ఈద్ కభీ దివాళి సినిమా షూటింగ్ నిమిత్తం ప్రస్తుతం హైదరాబాద్ లోనే స్టే చేస్తున్న సల్మాన్, తన క్లోజ్ ఫ్రెండ్స్ అందరిని ఒక్కొక్కరిగా కలుస్తున్నారు. ఈ క్రమంలో తన స్నేహితుడైన పవన్ రెడ్డి పార్టీకి సల్మాన్ హాజరవడం జరిగింది.
విక్రమ్ మూవీ సక్సెస్ సందర్భంగా కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్, నితిన్ లకు చిరంజీవి తన స్వగృహంలో విందును ఏర్పాటు చేయగా, ఆ పార్టీకి సల్మాన్ కూడా హాజరయ్యారు. తాజాగా జేసి పవన్ రెడ్డి పార్టీ లో చిరు, సల్మాన్ రెండోసారి కలవడం జరిగింది. కభీ ఈద్ కభీ దివాళి సినిమాలో వెంకటేష్ కీలక పాత్ర పోషించబోతున్నాడు అనే వార్తలు జోరుగా ప్రచారం జరుగుతన్న వేళ వెంకీ, సల్మాన్ కలిసి ఉన్నఈ ఫోటో బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఈ పిక్ బాగా వైరల్ అవుతుంది.

Latest News
 
RRR కాంట్రవర్సీ: "పుష్ప" నుండి రసూల్ ను తప్పించమని ఫ్యాన్స్ ట్వీట్లు Tue, Jul 05, 2022, 11:29 AM
సమంత హిందీ డిబట్ పై హీరోయిన్ తాప్సి అధికారిక ప్రకటన Tue, Jul 05, 2022, 10:56 AM
రకుల్ ప్రీత్ సింగ్ ట్రెండీ లుక్ Tue, Jul 05, 2022, 10:56 AM
డీజేటిల్లు 2 హీరోయిన్ మారింది ? Tue, Jul 05, 2022, 10:52 AM
"హ్యాపీ బర్త్ డే" డిజిటల్ & శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థలు Tue, Jul 05, 2022, 10:37 AM