"9 హవర్స్" తో తారకరత్న డిజిటల్ ఎంట్రీ

by సూర్య | Mon, May 23, 2022, 10:04 PM

ఒకటో నెంబర్ కుర్రాడు, అమరావతి, భద్రాద్రి రాముడు వంటి పలు టాలీవుడ్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైన నందమూరి హీరో తారకరత్న. అమరావతి సినిమాలో తారకరత్న తన అద్భుతమైన నటనకు గాను నంది అవార్డును అందుకున్నాడు. కొన్నాళ్లుగా అరకొర సినిమాల్లో నటిస్తున్న తారకరత్న తాజాగా ఓటిటి లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వ పర్యవేక్షణలో, జాకోబ్ వర్గీస్, నిరంజన్ కౌశిక్ సంయుక్తంగా డైరెక్ట్ చేస్తున్న '9 హవర్స్' అనే వెబ్ సిరీస్ లో తారకరత్న లీడ్ రోల్ లో నటిస్తున్నారు. పరంపర తర్వాత ప్రముఖ ఓటిటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవబోతున్న ఈ వెబ్ సిరీస్ లో తారకరత్నతో పాటు, అజయ్, వినోద్ కుమార్, మధు షాలిని, రవి వర్మ, ప్రీతీ అస్రాణి, అంకిత్ కొయ్య, జ్వాలా కోటి, మోనికా రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కు సంబందించిన ట్రైలర్ ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా రిలీజ్ చేసారు. జూన్ 2 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 9 హవర్స్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది.


 

Latest News
 
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM
తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచేసిన సిద్ధు జొన్నలగడ్డ Sat, May 18, 2024, 06:10 PM
బుక్ మై షోలో "OG" క్రేజ్ Sat, May 18, 2024, 06:09 PM