ఎల్లలు దాటుతున్న కార్తీ 'ఖైదీ' సినిమా

by సూర్య | Thu, May 19, 2022, 09:47 PM

తమిళ హీరో కార్తి వైవిధ్యభరిత సినిమాలను చేస్తూ తమిళ, తెలుగు భాషలలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.  కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాక కార్తీ తన సోదరుడు సూర్య తరహాలోనే ప్రయోగాత్మక సినిమాలు కూడా చేస్తుంటారు. ఈ కోవలోనే లోకేష్ కనగరాజన్ డైరెక్షన్లో ‘ఖైదీ’ సినిమా చేశారు. ‘నగరం’ వంటి థ్రిల్లర్ మూవీని తెరకెక్కించిన లోకేష్ కనకరాజ్ ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండానే  ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. కేవలం ఛేజింగ్‌లు, ఫైట్లు, ఎమోషన్స్‌తోనే రెండున్నర గంటల పాటు సినిమాను నడిపించారు. క్లైమాక్స్ లోనే ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉంటుందని చిన్న హింట్ ఇచ్చారు. తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో మంచి ఆదరణ పొందింది. ప్రస్తుతం, ఈ చిత్రం హిందీ రీమేక్, 'భోలా' పేరుతో నిర్మాణంలో ఉంది, ఇందులో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని రష్యాలో ప్రదర్శించబోతున్నారు. ఉస్నిక్ పేరుతో దాదాపు 121 నగరాల్లో 297 థియేటర్లలో ఈ చిత్రాన్ని 4 సీజన్స్ క్రియేషన్స్ సంస్థ విడుదల చేస్తుంది. రష్యాలో ఇంత భారీ స్థాయిలో విడుదలవుతున్న తొలి తమిళ చిత్రం ఇదే కావడం విశేషం. ఈ విషయం పట్ల ఖైదీ ని నిర్మించిన డ్రీమ్ వారియర్ నిర్మాణ సంస్థ తన సంతోషాన్ని తెలియచేసింది.

Latest News
 
వరుణ్ సందేశ్ 'నిందా' ఫస్ట్ లుక్ పోస్టర్ అవుట్ Mon, May 13, 2024, 09:28 PM
తలపతి 69లో మహేష్ బాబు, SRK మరియు మమ్ముట్టిని నటింపజేయాలని కోరుకుంటున్న- నెల్సన్ దిలీప్‌కుమార్ Mon, May 13, 2024, 09:26 PM
'కన్నప్ప' లో ప్రభాస్ పాత్ర గురించి ఓపెన్ అయ్యిన విష్ణు మంచు Mon, May 13, 2024, 09:12 PM
ఎన్టీ రామారావుకు భారతరత్న కోసం మద్దతు తెలిపిన మెగా స్టార్ Mon, May 13, 2024, 09:07 PM
2.3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'టర్బో' ట్రైలర్ Mon, May 13, 2024, 08:58 PM