పాన్ ఇండియా సినిమాలపై మరోసారి సిద్దార్ధ్ షాకింగ్ కామెంట్స్

by సూర్య | Thu, May 19, 2022, 08:57 PM

ఇటీవల హీరో సిద్దార్థ్ పాన్ ఇండియా సినిమాలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. ఒక సినిమా ఏ భాషలో రూపొందితే ఆ భాషా చిత్రంగా పిలిస్తే బావుంటుందని, లేకపోతే ఇండియన్ సినిమా అని పిలిస్తే బావుంటుందని సిద్ధార్థ్ వ్యాఖ్యానించారు. తాజాగా మరోసారి అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలనే చేసి సిద్దార్థ్ వార్తలకెక్కారు. సిద్దార్థ్ లీడ్ రోల్ లో నటించిన ఎస్కేప్ లైవ్ అనే  హిందీ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్దార్థ్ పాన్ ఇండియా సినిమాలపై తన స్పందనను తెలియచేసారు. కేజీఎఫ్ 2 సినిమాను పాన్ ఇండియా సినిమా అంటుంటే చాలా ఫన్నీ గా ఉందని సిద్దార్థ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ... "ఒక హిందీ సినిమా హిట్ అయ్యి వేరే భాషలలో విడుదలైతే బాలీవుడ్ సినిమా అంటున్నారు. మరి ప్రాంతీయ భాషలలో విశేష ఆదరణ పొందిన సినిమాను పాన్ ఇండియా సినిమా అని ఎందుకంటున్నారు? ఇండియన్ సినిమా అని పిలవొచ్చు కదా! కన్నడ చిత్ర పరిశ్రమను గౌరవించి కేజీఎఫ్ ను పాన్ ఇండియా సినిమా అని కాకుండా కన్నడ సినిమా లేక ఇండియన్ సినిమా అని పిలిస్తే బావుంటుంది. నా కెరీర్లో వేరే భాషా చిత్రాలలో నటించిన నేను, ఆ భాష రాకపోయినా నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పాను." అని తెలిపారు. సిద్దార్థ్ నటించిన ఎస్కేప్ లైవ్ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మే 20 నుండి స్ట్రీమింగ్ అవబోతుంది.

Latest News
 
"బింబిసార" టైటిల్ ర్యాప్ సాంగ్ ఔట్ Mon, Aug 08, 2022, 07:19 PM
సీతారామం కలెక్షన్లకు గండి కొట్టిన దుల్కర్ మార్కెట్ Mon, Aug 08, 2022, 06:50 PM
శర్వానంద్ నెక్స్ట్ "ఒకేఒక జీవితం" పై లేటెస్ట్ అప్డేట్ Mon, Aug 08, 2022, 06:39 PM
ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ లో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు Mon, Aug 08, 2022, 06:31 PM
సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన రానా...కారణం? Mon, Aug 08, 2022, 06:05 PM