శేఖర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ సుకుమార్

by సూర్య | Wed, May 18, 2022, 10:51 AM

చాలా కాలం తర్వాత సీనియర్ నటి జీవిత మెగాఫోన్ పట్టిన చిత్రం శేఖర్. సీనియర్ హీరో రాజశేఖర్ హీరోగా, మలయాళ సూపర్ హిట్ చిత్రం జోసెఫ్ కు తెలుగు రీమేక్ గా జీవిత శేఖర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ఆత్మీయ రాజన్, అభినవ్ , రవి వర్మ కీలక పాత్రలను పోషించారు. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ విడుదలవగా, ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. మూవీ నుండి విడుదలైన పోస్టర్లు, లిరికల్ సాంగ్స్ తో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. మే 20 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ సుకుమార్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. సుకుమార్ మాట్లాడుతూ తాను సినిమాల్లోకి రావటానికి రాజశేఖర్ పరోక్షంగా కారణమని తెలిపారు. రాజశేఖర్ హీరోగా చేసిన అంకుశం, ఆహుతి, తలంబ్రాలు, ఆగ్రహం చిత్రాలు తనలో సినీ ఇండస్ట్రీ పై మక్కువను పెంచాయన్నారు. ఈ మేరకు సుకుమార్ తన కాలేజీ రోజులను గుర్తుకు తెచ్చుకున్నారు. కాలేజీలో కృష్ణ అనే స్టూడెంట్ తన యాక్టింగ్ స్కిల్స్ తో కాలేజీలో మంచి ఫాలోయింగ్ ను తెచ్చుకున్నాడు. అది చూసి నాకు అసూయ కలిగింది. ఆ తర్వాత నేను రాజశేఖర్ గారిని ఇమిటేట్ చెయ్యటం స్టార్ట్ చేశాను. అప్పటినుండి కాలేజీలో కృష్ణ కన్నా నాకే ఫాలోయింగ్ పెరిగింది... అని సుకుమార్ చెప్పుకొచ్చారు. రాజశేఖర్ తన కూతుళ్లు శివాని, శివాత్మిక లను సినీ ఇండస్ట్రీలోకి రావటానికి ప్రోత్సహించటం చాలా గర్వించదగ్గ విషయమని సుకుమార్ పేర్కొన్నారు.

Latest News
 
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM
తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచేసిన సిద్ధు జొన్నలగడ్డ Sat, May 18, 2024, 06:10 PM
బుక్ మై షోలో "OG" క్రేజ్ Sat, May 18, 2024, 06:09 PM