ఈ ఏడాదిలోనే కేజీఎఫ్ 3 కి ముహూర్తం పెట్టిన ప్రశాంత్ నీల్

by సూర్య | Sat, May 14, 2022, 01:06 PM

కేజీఎఫ్ ఫ్రాంచైజీ తో దేశవ్యాప్త క్రేజును సొంతం చేసుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్. 2018లో చిన్న సినిమాగా విడుదలై భారీ కలెక్షన్లను రాబట్టడంతో దానికి కొనసాగింపుగా రాబోయే కేజీఎఫ్ 2 పై అంచనాలు ఆకాశాన్నంటాయి. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 ను రూపొందించారు. ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను వసూలు చేస్తోంది. కేజీఎఫ్ సినిమా సమయంలో జరిగిన ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూలు, ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు వంటి వాటిల్లో .. ఎక్కడా కూడా కేజీఎఫ్ 2 కు కొనసాగింపును ప్రకటించలేదు. అందరికీ సర్ప్రైజ్ ఇస్తూ , కేజీఎఫ్ 2 క్లైమాక్స్ లో మూడవ భాగం పై హింట్ ఇచ్చారు. ఈ విషయంపై రాఖీభాయ్ కూడా "కేజీఎఫ్ 3 ఉంటుంది, కానీ ఎప్పుడన్నది తెలీదు" అంటూ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.   


తాజాగా కేజీఎఫ్ 3 సినిమాను ప్రశాంత్ నీల్ ఈ ఏడాది డిసెంబర్ లోనే స్టార్ట్ చేస్తారంటూ చిత్రసీమలో వార్తలు వస్తున్నాయి. అయితే, వీటిని కేవలం పుకార్లని కొట్టేయ్యటానికి లేదు. ఎందుకంటే, ఈ వార్తను కెజిఎఫ్ ఫ్రాంచైజీ నిర్మాత, హోంబలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరంగదుర్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమాతో బిజీగా ఉన్న ప్రశాంత్ ఆ సినిమా షూటింగ్ ను వచ్చే నవంబర్ కల్లా పూర్తి చేసి అటుపై డిసెంబర్ నుండి కేజీఎఫ్ 3ని ప్రారంభిస్తారని విజయ్ పేర్కొన్నారు.

Latest News
 
భవదీయుడు భగత్ సింగ్' పై లేటెస్ట్ అప్డేట్ Fri, May 20, 2022, 04:43 PM
ప్రశాంత్ నీల్ హీరోతో 'భగీర' స్టార్ట్ చేసిన కేజీఎఫ్ 2 మేకర్స్ Fri, May 20, 2022, 04:38 PM
మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ Fri, May 20, 2022, 04:35 PM
ఆల్ యంగ్ యాక్టర్స్ తో 'సాఫ్ట్ వేర్ బ్లూస్' మూవీ... కేటీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ Fri, May 20, 2022, 04:33 PM
బన్నీ తో చెయ్యాల్సిన సినిమాను కొరటాల తారక్ తో చేస్తున్నాడా? Fri, May 20, 2022, 04:29 PM