by సూర్య | Tue, Jan 11, 2022, 11:00 AM
నాని హీరోగా 'జెర్సీ' సినిమా చేసిన గౌతమ్ తిన్ననూరి ఇటీవల చరణ్ కి ఒక కథను వినిపించడం .. ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి యూవీ క్రియేషన్స్ వారు ముందుకు రావడం జరిగిపోయింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ఇదిలావుంటే చూస్తుంటే చరణ్ యువ దర్శకులకు ఎక్కువగా ఛాన్స్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా అనిపిస్తోంది. ఇప్పటికే గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్న ఆయన, తాజాగా రాహుల్ సాంకృత్యన్ తోను ఒక సినిమా చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన కథపై కసరత్తుకూడా మొదలైపోయిందని అంటున్నారు. ఇక 'శ్యామ్ సింగ రాయ్' చూసిన చరణ్, ఒక మంచి కథను రెడీ చేయమని రాహుల్ కి చెప్పాడట. అందుకు సంబంధించిన పనిలోనే ఆయన ఉన్నాడని అంటున్నారు. నానితో చేసిన ఇద్దరి దర్శకులకి చరణ్ తో సినిమా చేసే ఛాన్స్ దక్కుతుండటం విశేషం. ఇక చరణ్ చేసిన 'ఆర్ ఆర్ ఆర్' .. 'ఆచార్య' విడుదలకు రెడీ అవుతుండగా, షూటింగు దశలో శంకర్ సినిమా ఉంది.
Latest News