'పుష్ప' సినిమా పై ప్రశంసలు కురిపించిన అర్జున్ కపూర్

by సూర్య | Mon, Jan 10, 2022, 02:30 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప' సినిమా ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.ఎర్ర చందనం అంశాన్ని తీసుకుని సుకుమార్ ఎంతో అద్భుతంగా రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఒక కూలి ఎర్రచందనం సిండికేట్ కి లీడర్ గా ఎలా ఎదిగాడు అనే కథాంశంతో వచ్చిన పుష్ప ఒక్క తెలుగు ప్రేక్షకులని కాదు యావత్ భారతదేశ సినీ ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో ముఖ్యంగా బన్నీ నటన కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

ఊర మాస్ లుక్ లో పుష్ప రాజ్ పాత్రలో బన్నీ తన విశ్వరూపం చూపించాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మూసుకొని విజయతీరాలకు చేర్చాడు. ఈ సినిమాలో బన్నీ నటనకి కేవలం టాలీవుడ్ నుంచే కాదు ఇతర ఇండ్రస్టీ ల నుంచి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమాలో బన్నీ నటన పై ఇప్పటికే పలువురు స్టార్స్ ప్రశంసల వర్షం కురిపించగా.. తాజాగా ఇప్పుడు ఈ జాబితాలో బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ కూడా చేరాడు. తన ఇన్స్టాగ్రామ్ వేదికగా అర్జున్ కపూర్ పోస్ట్ చేస్తూ.." ఆర్య బ్లాక్ బస్టర్ సినిమా నుంచి బన్నీకి నేను వీరాభిమానిని. పుష్ప సినిమా కాదు. ఇది ఒక అనుభవం. పుష్ప ఒక పువ్వు కాదు. అది నిప్పు.

బిగ్ స్క్రీన్ పై అతని కళ్ళు కణకణ మండుతున్నాయి" అంటూ పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవ్వగా.. ఈ పోస్టు పై బన్నీ స్పందించాడు. ఇక బన్నీ రీ పోస్ట్ చేస్తూ.." చాలా ధన్యవాదాలు.మీరు అగ్ని ని అనుభవించినందుకు ఉప్పొంగాను. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు" అంటూ రిప్లై ఇచ్చాడు బన్నీ. ఏదేమైనా పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ మాత్రం పాన్ ఇండియా స్థాయిలో దూసుకు పోయిందని చెప్పవచ్చు. ఇక పుష్ప సినిమా ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. తాజాగా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమాకి భారీ స్థాయిలో వ్యూస్ దక్కడం విశేషం...!!

Latest News
 
అక్టోబరు 5న సందడి చేయనున్న 'ది ఘోస్ట్' మూవీ Sat, Sep 24, 2022, 11:30 PM
'సీత రామం' 42 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Sat, Sep 24, 2022, 09:01 PM
సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'ది ఘోస్ట్‌' Sat, Sep 24, 2022, 08:57 PM
ఇంటెన్స్ గా 'రానా నాయుడు' టీజర్ Sat, Sep 24, 2022, 08:54 PM
OTT భాగస్వామిని లాక్ చేసిన 'కృష్ణ బృందా విహారి' Sat, Sep 24, 2022, 08:51 PM