మరోసారి నెగిటివ్ షేడ్స్ లో సమంత!

by సూర్య | Mon, Jan 10, 2022, 02:28 PM

విడాకుల తర్వాత సమంత కెరీర్ మరింత ఊపందుకుంది. తాజాగా మరోసారి ఛాలెంజింగ్ రోల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఆమె నటించిన 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయింది. 'రాజీ' పాత్రలో సమంత నెగిటివ్ షేడ్స్‌లో అందరినీ ఆకట్టుకుంది. ఆమె మరోసారి నెగిటివ్ షేడ్‌లో కనిపించబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, లేడీ సూపర్ స్టార్ నయనతార సరసన సామ్ 'కట్టువాక్కుల రెండు కాదల్' చిత్రంలో నటిస్తోంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమె 'ఖతీజా' పాత్రను పోషించింది. అయితే ఆ పాత్ర నెగెటివ్ షేడ్స్ లో ఉంటుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Latest News
 
సుధీర్‌ బాబు ‘హంట్‌’ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ Sun, Oct 02, 2022, 10:57 PM
నాని 'దసరా' మూవీ ఫస్ట్ సింగిల్ అప్డేట్ Sun, Oct 02, 2022, 10:52 PM
ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న 'రంగ రంగ వైభవంగా' మూవీ Sun, Oct 02, 2022, 09:38 PM
ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ టీజర్ రిలీజ్ Sun, Oct 02, 2022, 08:51 PM
గంభీరంగా పలికిన ఆ డైలాగ్ తో ఆదిపురుష్ టీజర్ విడుదల Sun, Oct 02, 2022, 08:49 PM