'ఎఫ్‌3' సినిమాలో బాలయ్య లెజెండ్ బ్యూటీ

by సూర్య | Fri, Oct 22, 2021, 12:09 PM

'ఎఫ్‌2' తర్వాత అదే బృందం కలిసి చేస్తున్న చిత్రం 'ఎఫ్‌3'. తమన్నా, మెహరీన్‌ కథానాయికలుగా నటిస్తుండగా, సునీల్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌ నిర్మిస్తున్నారు. దిల్‌ రాజు సమర్పకులు.ఈ సినిమాలో వినోదాన్నే కాదు అందం మోతాదుని మరింత పెంచేందుకు కథానాయిక సోనాల్‌ చౌహాన్‌ రంగంలోకి దిగింది. ఈ సందర్భంగా చిత్రబృందం సోనాల్‌ పాత్రకి సంబంధించిన లుక్‌ని గురువారం విడుదల చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో సాగుతున్న సుదీర్ఘమైన షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఛాయాగ్రహనం: సాయిశ్రీరామ్‌, కూర్పు: తమ్మిరాజు, సహ నిర్మాత: హర్షిత్‌ రెడ్డి.

Latest News
 
ప్రముఖ గాయని కన్నుమూత Thu, May 02, 2024, 10:25 AM
'ప్రసన్నవదనం' లో ఆధ్య గా పాయల్ రాధా కృష్ణ Wed, May 01, 2024, 09:18 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ది వారియర్' Wed, May 01, 2024, 09:18 PM
ప్రీపోన్ అయ్యిన మమ్ముట్టి 'టర్బో' Wed, May 01, 2024, 09:14 PM
'సాలార్ 2' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Wed, May 01, 2024, 09:08 PM