ఖిలాడీ మూవీ రీమేక్ కాదు అన్న డైరెక్టర్ ?

by సూర్య | Tue, Jun 08, 2021, 01:12 PM

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.థ్రిల్లర్ కథాంశంతో రాబోతున్న ఈ మూవీలో రవితేజ ఒక దొంగగా కనిపిస్తాడని టాక్ వినిపిస్తుంది. రవితేజ హీరోగా ఖిలాడీ అనే సినిమా చేస్తున్నాడు దర్శకుడు రమేష్ వర్మ. అయితే ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్టు కాదంటున్నాడు. తను చేయాలనుకున్న సినిమా వేరే ఒకటి ఉందని చెప్పుకొచ్చాడు. ఇతర కమిట్ మెంట్స్ వల్ల కుదర్లేదంటున్నాడు. మరోవైపు ఖిలాడీ సినిమా పుకార్లపై కూడా స్పందించాడు ఈ డైరక్టర్."ఖిలాడీ సినిమాను అంతా రీమేక్ అంటున్నారు. అది రీమేక్ కాదు. అయితే ఓ తమిళ సినిమాకు దగ్గరగా మా మూవీ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆ తమిళ సినిమా ఇంటర్వెల్ కు, ఖిలాడీ ఇంటర్వెల్ బ్యాంగ్ కు చాలా దగ్గర పోలిక ఉంటుంది. దీనికి సంబంధించి ఆ తమిళ సినిమా నిర్మాతతో నేను మాట్లాడాను. ఇది తప్పితే, మిగతాదంతా చాలా ఫ్రెష్ గా ఉంటుంది."అంతేగాని ఈ మూవీ రీమేక్ అయితే కాదని చెప్పుకొచ్చాడు.  ఇక ఈ మూవీ నలభై శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది.లాక్ డౌన్ నుంచి మినహాయింపు లభించిన వెంటనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM