విజయ దేవరకొండ నిర్మాత గా చాల బిజీ షెడ్యూల్ ?

by సూర్య | Wed, Jun 02, 2021, 11:28 AM

అర్జున్ రెడ్డి సినిమా తో మంచి క్రేజ్ సంపాదించుకున్న విజయ్ ఆ తర్వాత వరుస అవకాశాలతో తన ఖాతా నింపుకుంటున్నాడు. ఒక్క సినిమాతో స్టార్ హోదా ను అందుకున్నాడు. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్ గా మారిన విజయ్ నిర్మాతగా కూడా ముందుకు వచ్చాడు. ప్రస్తుతం తన ప్రొడక్షన్ లో మరో సినిమా మొదలు పెట్టానున్నాడు విజయ్.ప్రస్తుతం విజయ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ నటి అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్, టాలీవుడ్ బ్యూటీ ఛార్మి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ తనకంటూ సొంతంగా 'కింగ్ ఆఫ్ ది హిల్' అనే పేరుతో బ్యానర్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో 'మీకు మాత్రమే చెప్తా' అనే సినిమాను కూడా నిర్మించాడు.ఇదిలా ఉంటే విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ 'పుష్పక విమానం' అనే సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో డైరెక్టర్ గా దామోదర్ పరిచయం కానున్నాడు. ఇక ఈ సినిమాకు కూడా విజయ్ దేవరకొండ నిర్మాతగా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే విజయ్ మరో సినిమాలో తన ప్రొడక్షన్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాకు దర్శకుడిగా పృథ్వీ సేన పరిచయం కానున్నాడట. ఈ సినిమాలో కొత్తవారికి అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పరిస్థితుల నుండి బయట పడ్డాక ఈ సినిమాను కూడా త్వరలో మొదలు పెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి విజయ్ అటు హీరోగా ఇటు నిర్మాతగా తెగ బిజీ గా మారాడు.

Latest News
 
స్టార్ హీరో కొడుకుతో సుధా కొంగర తదుపరి సినిమా Fri, Apr 26, 2024, 07:21 PM
అమితాబ్ బచ్చన్ మనవడితో రొమాన్స్ చేయనున్న అక్షయ్ కుమార్ మేనకోడలు Fri, Apr 26, 2024, 07:13 PM
'రామం రాఘవం' టీజర్ విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:01 PM
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'కృష్ణమ్మ' Fri, Apr 26, 2024, 06:56 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'సరిపోద శనివారం' Fri, Apr 26, 2024, 06:42 PM