కర్రి బాలాజీ కోసం బ్యాక్ డోర్ ఎంట్రీ ఇస్తున్న పూర్ణ

by సూర్య | Mon, Oct 12, 2020, 05:44 PM

యువ ప్రతిభాశాలి-నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ 'బ్యాక్ డోర్' పేరుతో తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ కథానాయకి పూర్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఈ విభిన్న కథా చిత్రాన్ని.. 'ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్' పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు నేడు (12-10-2020) లాంఛనంగా జరిగాయి.


దర్శకుడు కర్రి బాలాజీ మాట్లాడుతూ.."బ్యాక్ డోర్"ఎంట్రీ అన్నది ఈరోజుల్లో అన్ని రంగాల్లో చాలా కామన్ అయిపోయింది. అటువంటి ఓ ప్రత్యేకమైన "బ్యాక్ డోర్" ఎంట్రీ వల్ల ఎదురయ్యే విచిత్ర పరిణామాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ వినూత్న చిత్రం హీరోయిన్ పూర్ణ కెరీర్ లో ఓ మైలు రాయిలా నిలిచిపోతుంది" అని అన్నారు. 'ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్' అధినేత బి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... 'త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. శర వేగంతో షూటింగ్ పూర్తి చేసేందుకు మా దర్శకుడు కర్రి బాలాజీ అన్ని సన్నాహాలు చేస్తున్నారు" అని వివరించారు. చాలా రోజుల తర్వాత ఓ ఛాలెంజింగ్ రోల్ చేసే అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు హీరోయిన్ పూర్ణ కృతజ్ఞతలు తెలిపారు.


ఈ చిత్రానికి పాటలు: జావళి, సంగీతం: ప్రణవ్, ఆర్ట్: నాని, ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్,


కెమెరా: శ్రీకాంత్, పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ,


రచనాసహకారం: భూపతిరాజు రామకృష్ణ-రవి రోహిత్.జి, నిర్మాత: బి.శ్రీనివాస్ రెడ్డి, రచన-దర్శకత్వం: కర్రి బాలాజీ!!

Latest News
 
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM
OTT ఎంట్రీ ఇచ్చేసిన 'లాపాటా లేడీస్' Fri, Apr 26, 2024, 07:30 PM
స్టార్ హీరో కొడుకుతో సుధా కొంగర తదుపరి సినిమా Fri, Apr 26, 2024, 07:21 PM
అమితాబ్ బచ్చన్ మనవడితో రొమాన్స్ చేయనున్న అక్షయ్ కుమార్ మేనకోడలు Fri, Apr 26, 2024, 07:13 PM
'రామం రాఘవం' టీజర్ విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:01 PM