రియా విషయంలో జర్నలిస్టులకు హెచ్చరికలు జారీ చేసిన ముంబై పోలీసులు...

by సూర్య | Wed, Oct 07, 2020, 03:31 PM

డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్ సింగ్ ప్రియురాలు రియా చక్రవర్తికి బెయిల్ లభించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఆమె జైలు నుంచి విడుదల కానుంది. అయితే, ఇప్పటికే ఈ కేసులో రియా నుంచి ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన జాతీయ మీడియా మరోసారి ఆమె వెంటపడే అవకాశం ఉండడంతో మీడియాకు ముంబై పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.


ఆమె బెయిలుపై జైలు నుంచి బయటకు వచ్చే సందర్భంలో మీడియా ఆమె వాహనాన్ని వెంబడించరాదని అన్నారు. ఆమెను సంబంధం లేని ప్రశ్నలు అడగవద్దని చెప్పారు. సెలబ్రిటీలను,  వారి న్యాయవాదులను జర్నలిస్టులు ఇంటర్వ్యూలు చేయాలనే ఉద్దేశంతో వారి వాహనాలను వెంబడించొద్దని సూచించారు. ఇలా వాహనాలను వెంబడించడం నేరమని పోలీసులు స్పష్టం చేశారు.


అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వాహనాలను వెంబడిస్తే జర్నలిస్టుల జీవితాలతోపాటు, రోడ్ల మీద నడుస్తున్న సాధారణ ప్రజలకు ప్రమాదమని చెప్పారు. సెలబ్రిటీల వాహనాలను ఇతర వాహనాల్లో వెంబడించే డ్రైవర్‌తో పాటు వారిని ప్రేరేపించిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM