'ఆర్ ఆర్ ఆర్' జనవరి 8వ తేదీనే విడుదల

by సూర్య | Sat, Apr 04, 2020, 08:18 PM

రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' రూపొందుతోంది. ఎన్టీఆర్ - చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఇప్పటికే 75 శాతం చిత్రీకరణను జరుపుకుంది. ఆ తరువాత షూటింగు జరుగుతుండగానే కరోనా ఎఫెక్ట్ పడింది. ఫలితంగా ఈ సినిమా షూటింగు ఆగిపోయింది. లాక్ డౌన్ ప్రభావం షూటింగుపై  .. విడుదల తేదీపై పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా చెప్పినట్టుగా ఈ సినిమా జనవరి 8వ తేదీన విడుదల కాకపోవచ్చని అంటున్నారు.ఈ నేపథ్యంలో ఈ సినిమా నిర్మాత డీవీవీ దానయ్య ఒక ఆంగ్ల దిన పత్రికతో మాట్లాడుతూ, లాక్ డౌన్ కారణంగా 'ఆర్ ఆర్ ఆర్' సినిమా విడుదల వాయిదా పడుతుందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు. ఇప్పటికే గ్రాఫిక్స్ వర్క్ కూడా చాలా వరకూ పూర్తయిందనీ, ముందుగా చెప్పిన ప్రకారమే ఈ సినిమాను జనవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అన్నారు.

Latest News
 
ఈ వారం థియేటర్స్ లో విడుదల కానున్న కొత్త టైటిల్స్ Fri, Apr 26, 2024, 03:17 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:14 PM
OTT ఎంట్రీ తేదీని లాక్ చేసిన 'డియర్' Fri, Apr 26, 2024, 03:11 PM
శుక్రవారం రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:10 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా రవి శంకర్ Fri, Apr 26, 2024, 03:07 PM