పోలీసుల ట్విట్ పై ఆసక్తికరంగా స్పందించిన హృతిక్ రోషన్..

by సూర్య | Thu, Apr 02, 2020, 11:45 AM

ఇవాళ్టి నుంచి ఏప్రిల్ నెల మొదలైంది. ‘ఏప్రిల్’ అనగానే పిల్లలు సహా పెద్దలకు గుర్తుకు వచ్చే పదం ‘ఫూల్’. ఈ నెల మొదటి రోజున.. లేనిది ఉన్నట్టుగా చెప్పి అవతలి వ్యక్తిని నమ్మించే ప్రయత్నం చేసి, ఒకవేళ ఆ వ్యక్తి నమ్మితే  ‘ఏప్రిల్ ఫూల్’ అంటూ వారిని ఆట పట్టించడం పరిపాటి.


ఇదిలా ఉండగా, ప్రస్తుతం కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తల గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పలు శాఖలు ఏకరవు పెడుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలను చైతన్య పరిచేందుకు ముంబయి పోలీస్ కూడా ఓ వినూత్న ఆలోచనతో హాస్యం పుట్టుకొచ్చే ఓ పోస్ట్ ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈరోజు షేర్ చేసింది.


‘మీ కోసం ఓ రహస్య సమాచారం’ అంటూ ఆ సమాచారం చూడాలంటే ‘జూమ్ ఇన్’ చేయాలంటూ ఆ పోస్ట్ లోనే చిన్న అక్షరాలతో మూడు లైన్ల మెస్సేజ్ ను ముంబయి పోలీస్ తన పోస్ట్ లో పేర్కొంది. ఆ వాక్యాలను పెద్దవి చేసి చూస్తే.. 'మరీ దగ్గరగా ఉండకండి.. ఫూల్ అవ్వకండి ..సామాజిక దూరం (సోషల్ డిస్టెన్స్) పాటించండి' అనే సందేశాన్ని హాస్యయుక్తంగా చెప్పడం కనబడుతుంది.


ఆ పోస్ట్ పై ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ స్పందించాడు. ఈ పోస్ట్ చాలా వినూత్నంగా ఉందని, తీవ్రమైన సమస్యలను సైతం కొద్దిపాటి హాస్యం జోడించి చెప్పవచ్చన్న విషయాన్నిగుర్తు చేస్తోందని బదులిచ్చాడు.

Latest News
 
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM
OTT ఎంట్రీ ఇచ్చేసిన 'లాపాటా లేడీస్' Fri, Apr 26, 2024, 07:30 PM