అద్భుత కళాకండానికి '14 ఏళ్ళు'

by సూర్య | Mon, Mar 30, 2020, 10:53 AM

భక్తిరస కథా చిత్రాలతోనే అద్భుత కళాకాండం అయిన 'శ్రీరామదాసు' విడుదలై నేటికీ 14 ఏళ్ళు అవుతుంది. తహసీల్దార్ గోపన్న సీతారామచంద్రస్వామి ఆలయాన్ని ఎలా నిర్మించాడు అనే కథాంశానికి ప్రతిఒక్కరు ముగ్దుడయ్యే డ్రామాని కలిపి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు దర్శకుడు కె. రాఘవేంద్రరావు. 'రామదాసు' పాత్రలో అక్కినేని నాగార్జున అద్భుత నటనకు ప్రజలు నీరాజనం పట్టారు. ఇందులోని అంతా రామమయం ఈ జగమంతా రామమయం..తాగరా శ్రీరామ నామామృతం..శ్రీ రామ నీ నామమెంతో రుచిరా..నను బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి..దాశరథీ కరుణాపయోనిధి..లాంటి ఎన్నో పాటలు ఇప్పటికీ అన్ని ఆలయాల్లో మారుమ్రోగుతూనే ఉన్నాయి. స్నేహ, నాజర్, అక్కినేని నాగేశ్వరరావు లాంటి నటులు తమ నటనతో ఆకట్టుకోగా ఎం.ఎం కీరవాణి అందించిన సంగీతం ఈ సినిమా స్థాయిని పెంచింది. మొత్తంగా తెలుగు సినిమా చరిత్రలోనే 'శ్రీరామదాసు' ఒక కళాకాండంగా నిలిచిపోతుంది అనడంతో అతిశయోక్తి లేదు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'మట్టి కుస్తి' Sat, May 04, 2024, 02:15 PM
సుప్రీత క్రష్ ఎవరో తెలుసా..? Sat, May 04, 2024, 10:58 AM
ఇవాళ దాసరి నారాయణరావు జయంతి Sat, May 04, 2024, 10:16 AM
అందుకే ఓటు వేయలేదు: జ్యోతిక Sat, May 04, 2024, 10:10 AM
'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగల్ అవుట్ Fri, May 03, 2024, 08:55 PM