హీరోలంతా మేము ఉన్నాం అంటూ తమ వంతుగా సినీ కార్మికులకు చేయూత..

by సూర్య | Sun, Mar 29, 2020, 12:37 PM

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా చేయాల్సిన అన్ని కార్యక్రమాలు చేస్తున్నాయి.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అందులో భాగంగా రాష్ట్రాలు 21 రోజుల పాటు అనగా వచ్చే నెల ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్ డౌన్ పాటిస్తున్నాయి. కొన్ని అత్యవసర సేవలు సర్వీసులు మినహాయించి అన్ని రకాల వర్తక వాణిజ్య వ్యాపార పనులు తాత్కాలికంగా నిలిపివేశారు. అందులో భాగంగా సినిమా పరిశ్రమకు సంబంధించి అన్ని రకాల షూటింగ్ లు, ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, రిలీజ్ మరియు అన్ని రకాల ఈవెంట్లు కొంతకాలం వరకు వాయిదా పడ్డాయి. దీంతో  సినిమా పరిశ్రమ పై ఆధారపడిన ఎంతోమంది రోజువారీ కార్మికులకు అండగా మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో "కరోనా క్రైసిస్ చారిటీ" పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా సినీ పరిశ్రమకు సంబంధించిన రోజువారీ కార్మికుల సంక్షేమం కోసం పని చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి విజయవంతంగా చేయడానికి సినిమా పరిశ్రమకు సంబంధించిన అనేక మంది తమ వంతు సహాయం ప్రకటిస్తున్నారు. తాజాగా యువ హీరో తాజాగా యువ హీరో అక్కినేని నాగచైతన్య కూడా తనవంతు సహాయంగా 30 లక్షలు ప్రకటించగా.. మరో యువ హీరో వరుణ్ తేజ్ 20 లక్షల్నీ ప్రకటించాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మరో యువ హీరో విశ్వక్ సేన్ తన వంతుగా 5 లక్షల్నీ ప్రకటించాడు. దిల్ రాజు మరో పదిలక్షల్నీ ఈ కరోనా క్రైసిన్ చారిటీకి ప్రకటించాడు.హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఒక లక్షరూపాయలు ప్రకటించింది. హీరో శర్వానంద్ 15 లక్షల్నీ ప్రకటించాడు. మరో యువ హీరో కార్తికేయ రెండు లక్షల్నీ ప్రకటించాడు.

Latest News
 
'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగల్ అవుట్ Fri, May 03, 2024, 08:55 PM
బుక్ మై షో ట్రేండింగ్ లో 'ఆ ఒక్కటి అడక్కు' Fri, May 03, 2024, 08:53 PM
'కన్నప్ప' షూటింగ్ ని పూర్తి చేసుకున్న అక్షయ్ కుమార్ Fri, May 03, 2024, 08:51 PM
'ఇండియన్ 2' ఆడియో లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో Fri, May 03, 2024, 08:49 PM
'ఓ మంచి ఘోస్ట్' నుండి కాన్సెప్ట్ పోస్టర్ మరియు గ్లింప్స్ విడుదల Fri, May 03, 2024, 06:26 PM