సినిమా ఫ్యాన్స్ మరో షాక్ ''ఆర్ ఆర్ ఆర్'' విడుదల కు కరోనా దెబ్బ...

by సూర్య | Sun, Mar 29, 2020, 12:40 PM

ఈ మధ్యే RRR సినిమా గురించి చాలా అప్‌డేట్స్ ఇచ్చాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఉగాదికి మోషన్ పోస్టర్.. రెండు రోజుల తర్వాత రామ్ చరణ్ టీజర్ విడుదల చేసి ఔరా అనిపించాడు. ఈ రెండు చూసిన తర్వాత అభిమానులకు సినిమా చూడాలన్న ఆసక్తి మరింత పెరిగిపోయింది. సాధారణ ప్రేక్షకులు కూడా RRR కోసం వేచి చూస్తున్నారు. రామ్ చరణ్ లుక్ చూసిన తర్వాత ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని చూస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతానికి కరోనా కారణంగా వాయిదా పడింది. మళ్లీ మే నుంచి గానీ మొదలయ్యేలా కనిపించడం లేదు. అంటే మధ్యలో రెండు నెలలు అనుకోని బ్రేక్ వచ్చిందన్నమాట.దీని ప్రభావం ఇప్పుడు విడుదల తేదీపై పడేలా కనిపిస్తుంది. ఈ సినిమా అనుకున్న తేదీకి కాకుండా మరో ఆర్నెళ్లు వాయిదా పడుతుందని ప్రచారం జరుగుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో పాటు షూటింగ్ కూడా ఇంకా బ్యాలెన్స్ ఉండటంతో సినిమాను జనవరి 8న తీసుకురావడం కష్టమే అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసామని.. ఇప్పట్నుంచి మరింత వేగంగా సినిమా పూర్తి చేస్తామని చెప్పారు మేకర్స్. ఈ సినిమాలో ఇద్దరు ఫారెన్ యాక్టర్స్ కూడా నటిస్తున్నారు.ఐరిష్ బ్యూటీ అలిసన్ డూడీ కీలక పాత్రలో నటిస్తుంది. ఇక మరో హాలీవుడ్ యాక్టర్ రా స్టీవెన్ సన్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్నాడు. వీళ్లు ఇప్పటికే షూటింగ్‌లో పాల్గొన్నారు కూడా. సినిమా అద్భుతంగా వస్తుందంటూ వాళ్లు చెబుతున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ ఈ చిత్ర విడుదల తేదీపై మాత్రం మళ్లీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసాడు రాజమౌళి. సినిమా 10 భాషల్లో జనవరి 8న విడుదలవుతుందని ఆ మధ్య ప్రెస్ నోట్ ఇచ్చాడు కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఈ చిత్రం బాహుబలి వచ్చిన జులై 10కి వాయిదా పడిందని తెలుస్తుంది.ఆ రోజే RRR కూడా విడుదల కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. తన సినిమా అప్ డేట్స్ కోసం అడగొద్దని.. అది బాగానే జరుగుతుందని చెప్పాడు జక్కన్న. క్వాలిటీ కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాడు రాజమౌళి.. అందుకే కాస్త ఆలస్యమైనా కూడా అనుకున్న ఔట్ పుట్ వచ్చేవరకు చెక్కుతూనే ఉంటాడు ఈ జక్కన్న. ఇందులో కొమరం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్.. అల్లూరిగా రామ్ చరణ్ నటిస్తున్నారు. 300 కోట్లతో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఈ చిత్ర విడుదల తేదీపై రాజమౌళి మళ్లీ క్లారిటీ ఇస్తాడో లేదో చూడాలిక.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'రంగ రంగ వైభవంగా' Sat, Apr 20, 2024, 06:46 PM
త్వరలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధం అవుతున్న 'మంజుమ్మెల్ బాయ్స్' Sat, Apr 20, 2024, 06:43 PM
'రాజా సాబ్' గురించిన లేటెస్ట్ అప్డేట్ Sat, Apr 20, 2024, 06:32 PM
జీ తెలుగులో ఆదివారం స్పెషల్ మూవీస్ Sat, Apr 20, 2024, 06:29 PM
'SK23' షూటింగ్ పూర్తి అయ్యేది ఎప్పుడంటే...! Sat, Apr 20, 2024, 06:27 PM