చిరు 152 మూవీ టైటిల్ ఏంటంటే ?

by సూర్య | Fri, Jan 17, 2020, 12:45 PM

 కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చిత్రం త్వరలో సెట్స్ మీదికి వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే సినిమాను అన్ని విధాలా గొప్పగా ఉండేలా చూస్తున్నారు కొరటాల. ముందుగా ఈ సినిమాకు ‘గోవింద ఆచార్య’ అనే టైటిల్ పరిగణనలో ఉన్నట్టు వార్తలొచ్చాయి. అయితే వాటిలో నిజమెంత ఉందో అనే అనుమానం మొదలైంది అభిమానుల్లో. కానీ సన్నిహిత వర్గాల సమాచారం మేరకు నిజంగానే ఆ టైటిల్ కొరటాల, చిరుల పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. టైటిల్ బట్టి చూస్తే సినిమాలో కొరటాల ఏదో బలమైన సామాజిక సందేశం ఇవ్వనున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాటనీ ఎంటర్టెయిన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ యేడాది ఆగష్టు 14న విడుదల చేయనున్నారు.

Latest News
 
'ధూత 2' లో పొలిమేర నటి Fri, May 03, 2024, 05:39 PM
కుబేర : 1M+ వ్యూస్ ని సాధించిన నాగార్జున ఫస్ట్ లుక్ Fri, May 03, 2024, 05:37 PM
డిజిటల్ ప్రసారానికి అందుబాటులోకి వచ్చిన 'హ్యాపీ ఎండింగ్' Fri, May 03, 2024, 05:29 PM
'హరి హర వీర మల్లు' విడుదల అప్పుడేనా? Fri, May 03, 2024, 05:28 PM
బజ్ - 'గుడ్ బ్యాడ్ అగ్లీ' లో మూడు విభిన్న రూపాల్లో కనిపించనున్న అజిత్ Fri, May 03, 2024, 04:58 PM