విజయ్ మూవీ నుంచి స్పెషల్ అప్డేట్ !

by సూర్య | Tue, Jan 14, 2020, 01:48 PM

దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న 'మాస్టర్' చిత్రంలో విజయ్ కాలేజ్ ప్రొఫెసర్ గా మాఫియా డాన్ గా భిన్న గెటప్స్ లో కనిపిస్తారని వినికిడి. ఇక మాస్టర్ మూవీలో టాలెంటెడ్ హీరో విజయ్ సేతుపతి విలన్ రోల్ చేస్తున్నాడు. మాస్టర్ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. వేసవి కానుగా ఏప్రిల్ నెలలో ఈ చిత్రం విడుదల చేయనున్నారని సమాచారం. గత ఐదేళ్లలో కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆయన వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడమే ఇందుకు కారణం. గత ఏడాది చివర్లో వచ్చిన బిగిల్ విజయ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ దక్కించుకుంది. విజయ్ సినిమాలకు ఉన్న డిమాండ్ రీత్యా అప్పుడే విజయ్ లేటెస్ట్ మూవీ మాస్టర్ ప్రదర్శన హక్కులు భారీ ధర చెల్లించి డిస్టిబ్యూటర్స్ దక్కించుకున్నారని సమాచారం. కాగా ఈ చిత్రంపై రేపు ఓ ఆసక్తికర అప్డేట్ ఇవ్వనున్నారట. మాస్టర్ మూవీకి సంబంధించిన ఓ స్పెషల్ న్యూస్ చిత్ర యూనిట్ అభిమానులతో పంచుకోనున్నారని తెలుస్తున్న సమాచారం. దీనితో ఆ స్పెషల్ అప్డేట్ ఏమై ఉంటుందా అని అప్పుడే అభిమానులలో ఆసక్తి పెరిగిపోయింది.

Latest News
 
పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపిన హీరోయిన్ శ్రీలీల Fri, May 10, 2024, 10:58 PM
234 నియోజకవర్గాల్లో 10,12వ తరగతి విద్యార్థులకు బహుమతులు అందజేయనున్న దళపతి విజయ్ Fri, May 10, 2024, 10:44 PM
'టర్బో' ట్రైలర్ విడుదలకి తేదీ లాక్ Fri, May 10, 2024, 07:28 PM
'ఓ మంచి ఘోస్ట్' టీజర్ అవుట్ Fri, May 10, 2024, 07:25 PM
OTT అరంగేట్రం చేసిన 8 A.M. మెట్రో Fri, May 10, 2024, 06:12 PM