బిగ్‌బాస్‌ : ఎలిమినేట్‌ అయ్యేదెవరో ?

by సూర్య | Sun, Oct 13, 2019, 12:36 PM

నిన్న శనివారం కావడంతో బిగ్ బాస్ హోస్ట్ నాగ్ షోలో దిగారు. హౌస్ మేట్స్ అందరినీ పలకరించిన నాగ్ కొద్దిసేపు హౌస్ మేట్స్ అందరిని పలకరించడంతో పాటు, చిన్న సమీక్ష జరిపారు. ఇక హౌస్ మేట్స్ తో కొన్ని ఫన్నీ టాస్క్ లు చేయించి అటు ఇంటి సభ్యులను ఇటు ప్రేక్షకులను అలరించారు. జాలీగా సాగిన బిగ్ బాస్ షో ఆహ్లాదంగా సాగింది. ఐతే ఎలిమినేషన్ లిస్ట్ లో ఉన్న ముగ్గురు అందరితో కలిసి ఎంజాయ్ చేసినా, కొంచెం టెన్షన్ మాత్రం ఫీలైనట్లు కనిపించారు. చాలా ఎపిసోడ్స్ లో ఎలిమినేషన్ లో ఉన్న ఒకరిద్దరిని శనివారమే సేఫ్ జోన్ లో ఉన్నట్లు ప్రకటిస్తారు. కానీ ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్న ముగ్గురిలో ఏ ఒక్కరిని సేఫ్ జోన్ లో ఉన్నట్లు చెప్పలేదు. దీనితో మరింత ఉత్కంఠ పెరిగిపోయింది. సామజిక మాధ్యమాలలో మాత్రం మహేష్ విట్టా ఎలిమినేట్ కానున్నట్లు ప్రముఖంగా వినిపిస్తుంది. ఐతే ముగ్గురి మధ్య టఫ్ కాంపిటీషన్ నెలకొన్న నేపధ్యం ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. మరి ఎవరు ఈ సారి హౌస్ లో బట్టలు సర్దుకోవాల్సి వస్తుందో కొద్దిగంటలో తెలియనుంది.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM